పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఆంక్షల నడుమ ఇరాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ట్రేడ్‌లో గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే భారత నౌకలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌తో పాటు తమ మిత్రదేశాలైన చైనా, ఇరాక్, ఖతార్‌ దేశాల కమర్షియల్ షిప్‌లకు కూడా ఈ వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ అధికారికంగా వెల్లడించారు.

Also Read : అమెరికా ఎన్నికల్లో కొత్త చరిత్ర: తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్

ఆంక్షలు లేకుండా ఫ్రీ మూవ్‌మెంట్

ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానంపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, భారత్‌ సహా నాలుగు దేశాల నౌకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని అమీర్ హయత్ స్పష్టం చేశారు. ఈ దేశాల కార్గో షిప్స్ ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని, అమెరికా కూడా వీటిని అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి సాధారణ ట్రాన్సిట్ ఫీజు (రవాణా రుసుము) మాత్రం వసూలు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : అమెరికా ఎన్నికల్లో సంచలనం.. జిహాదీ అన్న ట్రంప్‌కు బిగ్ షాక్.. యూఎస్ తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ చరిత్ర!

భారత్ నుంచి మెడిసిన్స్ సరఫరా కోసమే..

ఈ మినహాయింపుల వెనుక ఇరాన్‌కు స్పష్టమైన దౌత్య, ఆర్థిక వ్యూహం ఉంది. ముఖ్యంగా భారత్ నుంచి వెస్ట్ ఏషియా దేశాలకు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ (ఔషధాలు) సరఫరాను మరింత సులభతరం చేయడమే ప్రధాన ఉద్దేశమని ఇరాన్ తెలిపింది. భారత్ ఫార్మా రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా, అత్యవసర మందుల దిగుమతికి ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, అంతర్జాతీయ వేదికలపై చైనా నుంచి పొలిటికల్ సపోర్ట్ పొందడం, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం కూడా ఈ నిర్ణయానికి బలమైన కారణాలుగా తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలక లైఫ్‌లైన్‌గా ఉన్న హర్మూజ్‌లో భారత నౌకలకు దక్కిన ఈ ఊరటతో దేశీయ ఎగుమతిదారులకు, షిప్పింగ్ రంగానికి భారీ ప్రయోజనం చేకూరనుంది.