
అస్సాం ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలతో పరిపాలనా వర్గాల్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో బహుభార్యత్వంపై () తీవ్రమైన ఆంక్షలు విధించడంతో పాటు, రాష్ట్రంలో సంభవించిన భారీ వరదలపై సీబీఐ (CBI) విచారణకు మొగ్గు చూపింది. ఈ మేరకు సీఎం హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
Also Read : 2 కోట్ల లంచం కేసులో జ్ఞానేశ్ కుమార్: 20ఏళ్ల తర్వాత CECపై విచారణ
రెండో పెళ్లి చేసుకుంటే సర్వీస్ నుంచి డిస్మిస్ అస్సాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఇకపై వారిపై వేటు పడనుంది. బహుభార్యత్వానికి పాల్పడినట్లు తేలితే వారిని సర్వీస్ నుంచి వెంటనే తొలగించడమే (Dismiss) కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి గవర్నమెంట్ జాబ్ రాకుండా డిబార్ చేయనున్నారు.
ఈ రూల్ అమలు కోసం అస్సాం సర్వీస్ అండ్ డిసిప్లిన్ రూల్స్‌లోని నిబంధన 7లో సెక్షన్ 6ను చేర్చుతూ ప్రభుత్వం సవరణ చేసింది. ఇది ఏ ఒక్క రిలీజియన్‌కు మాత్రమే పరిమితం కాదని, యూనిఫాం సివిల్ కోడ్ (UCC) నేపథ్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల ఉద్యోగులకూ సమానంగా వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Also Read : జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.1000లకే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్..!
తీవ్ర వరదలపై సీబీఐ విచారణకు ప్రతిపాదన మరోవైపు, ఈ ఏడాది శివసాగర్, చరాయ్‌దేవ్ జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చిన ఆకస్మిక వరదలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లడం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో సమగ్ర విచారణ జరిపించాలని క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయించారు.
ఇందుకోసం రాబోయే పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి అఫీషియల్ లెటర్ పంపనున్నట్లు సీఎం తెలిపారు. అయితే, ఈ కేసును సీబీఐ టేకోవర్ చేయాలా వద్దా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.









