
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అగ్రరాజ్య రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుండగా.. విపక్ష డెమోక్రటిక్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కీలకమైన సెనెట్ స్థానాల్లో రిపబ్లికన్ల ఆధిక్యానికి గండి కొడుతూ డెమోక్రాట్లు ఘన విజయాలు సాధించారు. దీంతో సెనెట్‌లో స్పష్టమైన ఆధిపత్యం డెమోక్రాట్ల వశమైంది. అటు ప్రతినిధుల సభ ఫలితాల్లోనూ డెమోక్రాట్లే ఆధిక్యం దిశగా పయనిస్తుండటంతో వాషింగ్టన్లో అధికార సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
ఈ అనూహ్య ఫలితాలు, తమ పార్టీకి ఎదురైన పరాజయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన సొంత ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఆయన ఒక పోస్ట్ చేస్తూ వినూత్న వ్యాఖ్యలు చేశారు. “ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై నేరుగా నా పేరు ఉండి ఉంటే మనం ఏమాత్రం ఓడిపోయేవాళ్లం కాదు. ఒకవేళ నేనే స్వయంగా పోటీ బరిలో ఉంటే రిపబ్లికన్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి ఉండేది” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని, దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
Also Read : అమెరికా ఎన్నికల్లో సంచలనం.. జిహాదీ అన్న ట్రంప్‌కు బిగ్ షాక్.. యూఎస్ తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ చరిత్ర!
US President Donald Trump has claimed Republicans would have won the 2026 midterm elections “IN A LANDSLIDE” if his name had been on the ballot.
In a post on Truth Social, Trump said he was not on the ballot but insisted his presence would have changed the outcome, as voters delivered their verdict in the battle for control of Congress.
#DonaldTrump #USMidterms #USPolitics #USMidtermsonITG #IndiaTodayGlobal
— IndiaToday (@IndiaToday) November 4, 2026
ఈ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న రిపబ్లికన్ల కోటలు బద్దలయ్యాయి. ముఖ్యంగా సౌత్ కరోలినా రాష్ట్రంలో రిపబ్లికన్లకు భారీ షాక్ తగిలింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అక్కడ డెమోక్రాటిక్ పార్టీ సెనెట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ దివంగత సీనియర్ నేత లిండ్సే గ్రాహం సోదరి డార్లిన్ గ్రాహం ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆమెపై డెమోక్రటిక్ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్ ఘన విజయం సాధించారు. సౌత్ కరోలినాలో 1998 తర్వాత ఒక డెమోక్రటిక్ నేత సెనెటర్‌గా గెలవడం మళ్లీ ఇదే తొలిసారి కావడం విశేషం.
అలాగే మరో సాంప్రదాయ రిపబ్లికన్ గడ్డ అయిన టెక్సాస్‌లోనూ డెమోక్రాట్లు చరిత్ర తిరగరాశారు. గత 30 ఏళ్లకు పైగా అక్కడ కొనసాగుతున్న రిపబ్లికన్ల ఏకఛత్రాధిపత్యానికి డెమోక్రాట్లు చెక్ పెట్టారు. టెక్సాస్ సెనెట్ స్థానం నుంచి పోటీ చేసిన డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో సంచలన విజయం సాధించారు. టెక్సాస్‌లో చివరిసారిగా 1993లో డెమోక్రటిక్ నేత విజయం సాధించగా.. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆ పార్టీకి అక్కడ గెలుపే లేదు. మళ్లీ ఇన్నాళ్లకు జేమ్స్ తలారికో సాధించిన ఈ విజయం డెమోక్రాటిక్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇక ఒహాయో, అయోవా రాష్ట్రాల్లోనూ రిపబ్లికన్లకు ఓటమి తప్పలేదు. ఒహాయోలో రిపబ్లికన్ సెనెట్ అభ్యర్థి జాన్ హ్యూస్టెడ్ను డెమోక్రటిక్ సీనియర్ నేత షెరాడ్ బ్రౌన్ చిత్తు చేశారు. అలాగే అయోవాలో గత మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలుచుకున్న స్థానాన్ని ఈసారి డెమోక్రటిక్ నేత జోష్ టురెక్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాలన్నీ సెనెట్‌లో డెమోక్రాట్ల స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.
Also Read : అమెరికా మధ్యంతర ఎన్నికలు.. చరిత్ర సృష్టించిన పియా దాండియా.. వివేక్ రామస్వామికి బిగ్ షాక్!









