
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం, అంబానీ నెట్ వర్త్ ఒక్కసారిగా 8 బిలియన్ డాలర్లు (సుమారు 10.02 శాతం) పెరిగి, మొత్తం 88.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్ తర్వాత రిలయన్స్ షేర్లు భారీగా ర్యాలీ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. 2020 తర్వాత ఒకే రోజులో రిలయన్స్ స్టాక్ సాధించిన బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ ఇదే. ఈ భారీ జంప్‌తో అంబానీ ప్రపంచంలోనే సింగిల్ డేలో అత్యధిక సంపద పెంచుకున్న రెండో వ్యక్తిగా నిలిచారు.
తాజా ర్యాంకింగ్స్‌తో బైట్‌డ్యాన్స్ ఫౌండర్ జంగ్ యిమింగ్ 84 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోగా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 79.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం యిమింగ్ కంటే 4.3 బిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ కంటే 9.2 బిలియన్ డాలర్ల స్పష్టమైన లీడ్‌లో అంబానీ కొనసాగుతున్నారు.
వరల్డ్ లెవెల్లో టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ 878.5 బిలియన్ డాలర్ల అంచనా సంపదతో తిరుగులేని నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అమెజాన్ జెఫ్ బెజోస్ (366 బిలియన్ డాలర్లు), గూగుల్ లారీ పేజ్ (232.3 బిలియన్ డాలర్లు), మైఖేల్ డెల్ (218.5 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (213.9 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (208.6 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఒక్క రోజు గెయిన్స్‌లో మస్క్ 10 బిలియన్ డాలర్లు జోడించి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, అంబానీ 8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్ బెజోస్ 4.7 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Also Read : చైనా J-20 స్టెల్త్ ఫైటర్ల నయా అవతార్.. స్వదేశీ ఇంజిన్లు, లెటెస్ట్ సెన్సార్లు
భారీ నష్టాల్లో లారీ ఎల్లిసన్, డెల్
ఒకవైపు మార్కెట్ ర్యాలీతో కొందరు లాభపడితే, ఒరాకిల్ కో-ఫౌండర్ లారీ ఎల్లిసన్ ఒక్క రోజే 11.9 బిలియన్ డాలర్లు (6.91 శాతం) కోల్పోయి బిగ్గెస్ట్ లూజర్‌గా నిలిచారు. మైఖేల్ డెల్ 9.9 బిలియన్ డాలర్లు, స్టీవ్ బాల్మర్ 3.7 బిలియన్ డాలర్లు, జుకర్‌బర్గ్ 2.8 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు. స్టాక్ మార్కెట్లలో వచ్చే హెచ్చుతగ్గులు బిలియనీర్ల నెట్ వర్త్‌ను ఏ క్షణంలోనైనా ఎలా తారుమారు చేయగలవో ఈ మార్పులు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : స్కూళ్లలో టర్బన్లు, నిఖాబ్‌లపై నిషేధం: ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర దుమారం









