
ఇజ్రాయెల్ పాలిటిక్స్‌లో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. మంగళవారం జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) రాజకీయ భవిష్యత్తును తేల్చబోతున్నాయి. గాజా వార్, ఇరాన్‌తో కాన్ఫ్లిక్ట్, సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ నడుమ జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. నెతన్యాహు అధికారాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుండగా, అపోజిషన్ పార్టీలు గట్టి పోటీనిస్తున్నాయి.
ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘నెసెట్’లో మొత్తం 120 సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేజిక్ ఫిగర్ 61 సీట్లు అవసరం. అయితే, ఏ ఒక్క పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ వచ్చేలా లేదని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ సిట్యువేషన్లో రిజల్ట్స్‌ను డిసైడ్ చేసే మూడు మేజర్ ఫ్యాక్టర్స్ ఇవే:
Also Read : స్క్రీన్ దాటి వచ్చే సువాసనలు.. డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం!
అక్టోబర్ 7 సెక్యూరిటీ వైఫల్యం: 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి ఇజ్రాయెల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఇంత భారీ దాడికి ఎవరు రెస్పాన్సిబుల్ అన్నది ఓటర్లను ఆలోచింపజేస్తోంది. అపోజిషన్ దీనిని మెయిన్ వెపన్‌గా వాడుతుండగా, తన ఎక్స్‌పీరియన్సే దేశాన్ని కాపాడుతుందని నెతన్యాహు వాదిస్తున్నారు.
ఇరాన్ న్యూక్లియర్ త్రెట్ – AI స్ట్రాటజీ: పోలింగ్‌కు ముందు నెతన్యాహు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక AI ఇమేజ్ వైరల్ అయ్యింది. టెల్ అవీవ్‌పై న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగితే ఎలా ఉంటుందో చూపించి, ఇరాన్ ముప్పు ముందు మిగతా ఇష్యూస్ ఏవీ ముఖ్యం కాదని ఓటర్ల మైండ్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహును “యోధా ప్రధాని”గా కొనియాడటం ఆయనకు బిగ్ ప్లస్ పాయింట్‌గా మారింది. ట్రంప్‌తో కలిసి ఇరాన్ ముప్పును ఎదుర్కొంటానని నెతన్యాహు ప్రచారం చేసుకుంటున్నారు.
సర్వేల ప్రకారం నెతన్యాహు కూటమికి మెజారిటీ రాకపోవచ్చని, గడి ఐజెన్కోట్ నేతృత్వంలోని ‘యాషార్’ పార్టీ కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 28న ట్రెండ్స్, 29 నాటికి ఫుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నవంబర్ 4న అఫీషియల్ రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. ఆ తర్వాత ఎవరు ఎవరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది అసలైన సస్పెన్స్.
Also Read : మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు.. హైదరాబాద్ టెక్కీలపై బిగ్ ఎఫెక్ట్ పడనుందా?









