Wednesday, June 3, 23:51
30.2 C
Hyderabad

Trump Tariffs: భారత్‌కు బిగ్ షాక్.. మళ్లీ భారీగా సుంకాలు.. ఈసారి ఎంతంటే?

Trump Tariffs
Trump Tariffs

భారత్‌తో సహా ప్రపంచంలోని దాదాపు 60 దేశాలపై అమెరికా అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఆయా దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల తయారీలో బలవంతపు కార్మికులను వాడుతున్నారని.. దీనిని అడ్డుకోవడంలో ఆ దేశాలు విఫలమయ్యాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఆరోపించింది. ఈ వస్తువుల వల్ల అమెరికాలోని స్థానిక పరిశ్రమలకు, కార్మికులకు అన్యాయం జరుగుతోందని అమెరికా వాదిస్తోంది. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం అమెరికా ఓ దర్యాప్తు చేపట్టింది. బలవంతపు చాకిరీతో తయారైన ఉత్పత్తులను అడ్డుకోవడంలో భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రధాన వాణిజ్య భాగస్వాములు సమర్థవంతంగా పనిచేయడం లేదని ఈ దర్యాప్తులో తేలింది. అమెరికా మార్కెట్‌లోకి చౌకగా వస్తున్న ఈ వస్తువుల వల్ల అమెరికాలో బలవంతపు కార్మికులను వాడని కంపెనీలు నష్టపోతున్నాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్, అమెరికా దేశాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయి.  అయితే అమెరికా ఒకేసారి భారత్‌ను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఒకవేళ అమెరికా ఈ సుంకాలను అమలు చేస్తే ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు అదనపు పన్నులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వస్త్ర, దుస్తుల రంగానికి సంబంధించిన దిగుమతులపై కఠినమైన నిబంధనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన  చేయలేదు. దీనిపై అమెరికా ప్రభుత్వం జూలై 6వ తేదీ వరకు ఇతర దేశాల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ఆ తర్వాత జూలై 7న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING :  ఘోరం.. రెండు బస్సులు ఢీ… ఏడుగురు మృతి!