ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

Also Read : రేపే ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర.. ఈసారి హైలెట్స్ ఇవే!

హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అనర్హత వేటు పడిందని స్పష్టం చేస్తూ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తీర్పు నిచ్చింది. ఈ తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమైనట్లు కనిపిస్తోంది.

2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే బీఆర్ఎస్‌కు అధికారికంగా రాజీనామా చేయకుండానే 2024 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బీ-ఫారమ్ పోటీ చేయడం వివాదాస్పదమైంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరొక పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో వివాదస్పదమైంది.

Also Read : బీజేపీలో కీలక మార్పులు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జీలు!