
Bihar : బిహార్‌లోని జముయి జిల్లాలో 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికను కొందరు వ్యక్తులు అడ్డుకుని వేధించిన ఘటన కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 19న కోచింగ్ నుంచి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఇద్దరు విద్యార్థులు జముయిలోని మడ్వా పహాడ్ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. స్కూటర్ ఆపించి ఇద్దరినీ కిందకు దిగాలని చెప్పారు. ఆ తర్వాత బాలుడిని కొట్టడం, అతని చొక్కా కాలర్ పట్టుకోవడం, బాలికను వేధించడం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనను అక్కడున్న వారిలో కొందరు మొబైల్‌లో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read : దేశ రాజధానిలో దారుణం.. మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
వీడియోలో బాలుడు, బాలిక తమను వదిలేయాలని పదేపదే కోరుతున్నట్లు కనిపిస్తోంది. బాలుడి కాలర్ పట్టుకుని లాగడంతో అతను తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బాలికను కూడా ఓ వ్యక్తి పట్టుకుని లాగినట్లు వీడియోలో కనిపిస్తోంది. బాలుడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి అడ్డుకున్నాడు.
ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినా ఆ వ్యక్తులు వారిని వెంటాడారు. స్కూటర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో కూడా బాలికను చేతితో పట్టుకుని లాగినట్లు వీడియోలో కనిపించింది. చివరకు ఇద్దరూ తమను వదిలేయాలని వేడుకున్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జముయి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటన సెప్టెంబర్ 19న సాయంత్రం సమయంలో జరిగినట్లు జముయి పోలీసులు తెలిపారు. వీడియోలో ఆరుగురు నుంచి ఏడుగురు వరకు వ్యక్తులు కనిపిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోక్సో చట్టంతో పాటు ఇతర చట్టాల కింద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Also Read : హరిబాబు హత్యకేసులో బిగ్‌ట్విస్ట్… తానే చంపానని వైష్ణవి సోదరుడి వీడియో విడుదల









