
Delhi Gang Rape : ఆడపిల్లలకు ఎక్కడ, ఎవరితోనూ రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. స్నేహితులు అని నమ్మి వెళ్లిన మైనర్యువతిని ఆమె స్నేహితులే గ్యా్ంగ్ రేప్‌చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పొలాల్లోకి విసిరేసి వెళ్లిపోయారు. దీంతో దాన్ని కుక్కలు పీక్కుతినడం తీవ్ర కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …
Also Read : మార్చి 17న వైష్ణవి హత్య…సెప్టెంబర్ 17న హరిబాబు హత్య..ఇద్దరి మధ్య 17 సెంటిమెంట్ ఏంటి?
Delhi Police have claimed to have cracked a blind gang rape and murder case within 72 hours with the apprehension of four persons, including three juveniles, allegedly involved in the crime, officials said.
The case came to light on the morning of September 13, when police…
— ANI (@ANI) September 17, 2026
ఢిల్లీ కి చెందిన 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అతన్ని కలిసిన తర్వాత అతనితో పాటు అతడికి తెలిసిన మరో ముగ్గురు మైనర్లతో కలిసి ఒక టెంపోలో ప్రయాణించింది. ఈ క్రమంలో వారంతా మద్యం సేవించారు. అనంతరం బాలికపై అంతా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా విషయం బయటకు తెలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం శవాన్ని పొలాల్లోకి విసిరేసి వెళ్లిపోయారు. ఉత్తర ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ 13న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అయితే అది అమ్మాయిదో, అబ్బాయిదో గుర్తించలేని విధంగా కుళ్లిపోయిన స్థితిలో శరీరం లభించింది. శరీరం నుంచి ఒక చేయి వేరుపడిందని.. శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే ఇంత జరిగినప్పటికీ ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి రోజులు గడుస్తున్నా.. కుటుంబ సభ్యులనుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఆమె తరచుగా ఇంటినుంచి బయటకు వెళ్లి, రోజుల తరబడి తిరిగి ఇంటికి రాదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించడం గమనార్హం. పొలాల్లో శవాన్ని గుర్తించిన స్థానికులు అందించిన సమాచారం ఆధారంగా మృతదేహం ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా.. ఒక దగ్గర అనుమానస్పద టెంపోను గుర్తించారు. దాని ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులకు నలుగురు నిందితులు దొరికారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు నిర్ధారించారు. వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందనే దానిపై పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. నిందితులపై పోక్సోయాక్ట్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు .
Also Read : వైష్ణవి అన్నలు నన్నూ చంపేస్తారు… హరిబాబు తల్లి లక్ష్మి సంచలన వ్యాఖ్యలు









