
Weather alert :తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నందున తెలంగాణలో ఈరోజు(ఆదివారం) నుంచి వారం రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉండగా,ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
బుధవారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉంది.ఈనెల 23, 24 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోస్తాంధ్రలో 50–60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈనెల 24న తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, , హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఱ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అలాగే సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.









