
Xi Jinping : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కావడంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఆయన కోమాలోకి వెళ్లిపోయారని ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరలవుతోంది. ఇటీవల భారత్ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని, దీంతో స్పృహతప్పి పడిపోయారని వార్తలు వెలువడ్డాయి. చైనా డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్, అసమ్మతి నేత వాంజున్ షీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌తో ప్రపంచమంతా కలకలం రేగింది. దీంతో ఆయన ఆరోగ్యం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా, జిన్‌పింగ్‌కు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని ప్రచారం సాగుతోంది. చైనాకు చెందిన నిషేధిత పార్టీ నేత చేసిన X పోస్ట్సంచలనంగా మారింది. ‘‘జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సులో స్పృహ కోల్పోయారు, దీంతో ఆయనను హుటాహుటినా ప్రత్యేక విమానంలో చైనాకు తీసుకు వచ్చారు, అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించి ఎమర్జెన్సీ చికిత్స అందిస్తు్న్నారని ,కాగా, తన ఆరోగ్య పరిస్థితిపై భారత్‌కు తెలిసిపోతుందని , అందుకే అక్కడ ఆయన చికిత్సను నిరాకరించారని వాంజున్ తన పోస్టులో రాయడంతో జిన్ పింగ్ ఆరోగ్యంపై అనేక సందేహాలు మొదలయ్యాయి.
ఇటీవల ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరుగుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురయ్యారని తన పోస్టులో రాశారు. జిన్ పింగ్ ను అత్యవసర చికిత్స కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ హాస్పిటల్ (సాధారణంగా 301 హాస్పిటల్ అని పిలుస్తారు)లో షీని బీజింగ్‌కు తిరిగి తరలించారని వాంజున్ చెప్పారు. దీంతో జిన్ పింగ్ ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగాయి . వాంజున్ చైనాలో నిషేధించబడిన చైనా డెమోక్రసీ పార్టీ (CDP)కి చైర్మన్. వాంజున్ అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం.
Also Read : ఇరాన్‌పై భారీ ఆపరేషన్‌కు స్కెచ్.. అమెరికా, ఇజ్రాయెల్‌తో 7 అరబ్ దేశాల భేటీ!
ఈ ప్రచారం ఇలా ఉండగానే జిన్‌పింగ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు నిజం కాదని చైనా అధికారిక న్యూస్ వెబ్ సైట్ english.www.gov.cn రాసుకొచ్చింది. న్యూఢిల్లీ నుంచి బీజింగ్ వచ్చిన తర్వాత జిన్‌పింగ్ కు ఎటువంటి ఆనారోగ్యం కలగలేదని తెలిపింది.18 బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని చైనా మంత్రులు, అధికారులతో కలిసి ఆరోగ్యంగా తిరిగి వచ్చారని gov.cn కథనాలు చెబుతున్నాయి.
బ్రిక్స్ విందుకు జిన్‌పింగ్ గైర్హాజరుపై అనుమానాలు
కాగా ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం జిన్‌పింగ్ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీకి వచ్చారు. గడచిన ఏడేళ్లలో జిన్‌పింగ్ భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి.ఈ సమావేశాల్లో ఇండియాతో కలిసి పలు కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఆ తర్వాత భారత్ మండపంలో మోదీ ఏర్పాటు చేసిన విందులో మాత్రం పాల్గొనలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , పలువురు ఇతర బ్రిక్స్ నేతలు ఈ విందుకు హాజరు కాగా, షీ గైర్హాజరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బీజింగ్ తరపున హాజరైన విషయం తెలిసిందే. తీరిక లేకుండా గడిపిన ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి తన హోటల్‌కు తిరిగి వెళ్లారని అధికారులు చెప్పారు.అయితే ఆయన గైర్హాజరుకు అధికారిక వివరణ ఏదీ ఇప్పటివరకు వెలువడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారు. దీంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి, ఆయన క్షేమంగా ఉన్నారా అని అడిగారు. ఈ ఘటన.. జిన్ పింగ్ ఆరోగ్యంపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. వీడియో ఫుటేజీలో మోదీ, షీ ట్రాన్స్ లేటర్ వైపు తిరిగి, “ఫర్వాలేదా?” అని అడగడం స్పష్టంగా కనిపించింది. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ముందు చైనా అధ్యక్షుడు స్పందించినట్లు అందులో కనిపించింది. షీకి అంత అసౌకర్యం కలగడానికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియరాలేదు. అది మైక్‌లో ఏదైనా సమస్య వల్ల గానీ ,ఆయన ప్రసంగ అనువాదం వల్ల గానీ అయి ఉండవచ్చని భావించారు. కానీ, ప్రస్తుతం ఆ దేశపు అసమ్మతి నేత ఆరోపణలు సంచలనంగా మారాయి. మరోవైపు షీ తిరిగి చైనాకు వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలకడానికి ఎలాంటి ఆర్భాటమైన వేడుకలు నిర్వహించ లేదు. గతంలో కూడా ఎలాంటి ఆర్బాటాలు నిర్వహించలేదని, ఈసారి కూడా అదే చేశారని చైనా అధికారిక మీడియా ఓ ప్రకటనలను జారీ చేస్తూ జిన్ పింగ్ ఆరోగ్యంపై ప్రచారాలను కొట్టిపారేయడం గమనార్హం.
Also Read : భారత్‌పై 100 శాతం టారిఫ్‌ల బిల్లు.. ఓటు వేసేందుకు సిద్ధమైన యూఎస్ హౌస్..!









