Scholar Solomon :  ప్రముఖ తమిళ పండితుడు, పట్టిమండ్రం వక్త సాలమన్ పాపయ్య కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మదురైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. ఆయన మరణంతో అభిమానులు, తమిళ సాహిత్య రంగానికి చెందిన పలువురు విషాదంలో మునిగిపోయారు.

Also Read : టాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. రాజమౌళి, సమంత, మహేష్‌కు SIR నోటీసులు.. ఎందుకో తెలుసా?

మదురైలోని సాత్తాన్‌కుడికి చెందిన సాలమన్ పాపయ్య.. అరసరడి ప్రాంతంలోని జ్ఞానఒళిపురంలో కుటుంబంతో కలిసి ఉండేవారు. మదురై అమెరికన్ కాలేజీలో తమిళ విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. తమిళ భాషకు ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2000లో తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కలైమామణి అవార్డు ఇచ్చింది. 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

సాలమన్ పాపయ్యకు పట్టిమండ్రం కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు వచ్చింది. ఆయన మాట్లాడే విధానం చాలా సరదాగా ఉండేది. చక్కటి తమిళంలో హాస్యంగా మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. పట్టిమండ్రం అంటే సాలమన్ పాపయ్య గుర్తొచ్చేంతగా ఆయనకు పేరు వచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఆయన ఎన్నో పట్టిమండ్రం కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాటలు, హాస్యం, తమిళంపై ఉన్న పట్టు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సాలమన్ పాపయ్య కేవలం వక్తగానే కాకుండా రచయితగా, సంపాదకుడిగా, తమిళ ప్రొఫెసర్‌గా, నటుడిగా కూడా పనిచేశారు. రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో అంగవై, సంగవై కామెడీ సన్నివేశంలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాయ్స్, ముదల్వర్ వంటి సినిమాల్లో కూడా నటించారు. తమిళ భాషను తన మాటలతో, హాస్యంతో ప్రజలకు మరింత దగ్గర చేసిన సాలమన్ పాపయ్య మృతి తమిళ ప్రజలకు తీరని లోటుగా మారింది. హీరో రజినీకాంత్ తో పాటుగా పలువురు సంతాపం తెలిపారు.

Also Read : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయి వివాదంలో బిగ్ ట్విస్ట్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.