
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జుట్టు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా గోల్డెన్ బ్లాండ్ రంగులో కనిపించే ట్రంప్ జుట్టు ఈసారి మాత్రం కాస్త డార్క్‌గా కనిపించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ దిగిన తర్వాత ట్రంప్ విమానం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆయన జుట్టు సాధారణం కంటే చాలా ముదురు రంగులో కనిపించింది. ట్రంప్ వారాంతపు సెలవుల కోసం ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్మినిస్టర్కు వెళ్లారు.
Also Read : అప్పులు తీర్చలేక .. అమ్మాకానికి మొజ్తాబా ఖమేనీ ఇల్లు : ఎన్ని కోట్లంటే?
ఎప్పుడూ ముందుకు వంగిన స్టైల్లో గోల్డెన్ బ్లాండ్ జుట్టుతో కనిపించే ట్రంప్.. ఈసారి దాదాపు బ్రౌన్ రంగులో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్ని వారాల క్రితం లాస్ వెగాస్‌లో కనిపించినప్పుడు మాత్రం ఆయన జుట్టు చాలా ఎక్కువగా, బ్లాండ్ రంగులో కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ట్రంప్ జుట్టు ముదురు రంగులో కనిపించిన వెంటనే సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు ఇది నిజంగా ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్నా అని ఆశ్చర్యపోయారు. ఒక నెటిజన్ అయితే తానే గెట్టి ఇమేజెస్ నుంచి ఫొటోలు తీసుకున్నా, వాటిని చూసి నమ్మలేకపోయానని కామెంట్ చేశాడు.
అయితే తాను విగ్ పెట్టుకుంటానన్న ప్రచారాన్ని ట్రంప్ సెప్టెంబర్ 2న స్వయంగా ఖండించారు. 2024 ఎన్నికల ప్రచారంలో జరిగిన ఓ ర్యాలీ గురించి మాట్లాడుతూ.. తాను విగ్ పెట్టుకోనని స్పష్టం చేశారు. విగ్ పెట్టుకుని ఉంటే ఆ ర్యాలీలో అది తలపై ఎక్కువసేపు ఉండేది కాదని సరదాగా అన్నారు. ట్రంప్ తన హెయిర్‌స్టైల్‌ను తరచుగా మార్చరు. కానీ గతంలో మాత్రం ఆయన హెయిర్‌స్టైల్ మార్చిన సందర్భాలు ఉన్నాయి. 2019లో వర్జీనియాలో జరిగిన ఓ చర్చి కార్యక్రమానికి ట్రంప్ హాజరైనప్పుడు ఆయన జుట్టు వెనక్కి దువ్వినట్లుగా, సాధారణంగా కనిపించే స్టైల్‌కు భిన్నంగా కనిపించింది. ఆ హెయిర్‌స్టైల్ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ స్టైల్‌ను పోలి ఉందనే చర్చ కూడా జరిగింది. అయితే ఆ కొత్త స్టైల్ ఎక్కువకాలం కొనసాగలేదు. అదే రోజు తర్వాత ట్రంప్ మళ్లీ తనకు ఎప్పటినుంచో ఉన్న ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్‌తో కనిపించారు.
ట్రంప్ జుట్టుపై చర్చలు ఆయన అధ్యక్షుడు కాకముందు నుంచే ఉన్నాయి. ఆయన విగ్ పెట్టుకుంటారని, లేదా తలపై జుట్టు తగ్గిన ప్రాంతాన్ని శస్త్రచికిత్స ద్వారా సరిచేసుకున్నారని గతంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ట్రంప్ మొదటి భార్యకు సంబంధించిన విడాకుల కేసు సమయంలో కూడా ఆయన జుట్టు గురించి ఇలాంటి ప్రస్తావనలు వచ్చాయి. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ తన జుట్టు నిజమైనదేనని చూపించేందుకు ప్రయత్నించారు.
Also Read : హిందూ గ్రూప్ విజిట్.. ఈఫిల్ టవర్ మూసివేత!








