
Kerala : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఓ కుటుంబం ఫోన్ మాట్లాడేందుకు రోడ్డుపక్కన బైక్ ఆపింది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు.
ఈ ప్రమాదం త్రిశూర్‌లోని గురువాయూర్-కున్నంకుళం రోడ్డుపై శనివారం అర్ధరాత్రికి ముందు జరిగింది. ఎడక్కళియూర్‌కు చెందిన మునీర్ (35), ఆయన భార్య సఫ్నా (25), వారి మూడేళ్ల కుమారుడు యామిల్ ఐబక్ ఈ ప్రమాదంలో మృతి చెందారు.
Also Read : డ్యాన్స్ క్లాస్‌కు వెళ్తానన్న భార్య.. వంట చేయలేదని భర్త దారుణం!
పెళ్లి వేడుకకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఫోన్ కాల్ రావడంతో కుటుంబం బైక్‌ను రోడ్డుపక్కన ఆపింది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ముగ్గురూ దాదాపు 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కారు డ్రైవర్ కున్నంకుళంలోని ఓ బార్ నుంచి తిరిగి వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో ఒక రోజు ముందు కూడా మరో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలతో త్రిశూర్‌లో రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : డేటింగ్ యాప్‌లో అమ్మాయి పరిచయం.. ఆ తర్వాత షాకింగ్ ట్విస్ట్!









