Konda Surekha : మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించింది అధిష్టానం. ఆమె బర్త్‌రఫ్ లేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వద్దకు చేరింది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగా అధికారులు బర్త్‌రఫ్ లేఖను లోక్‌భవన్‌కు పంపించారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖను అధిష్టానం కోరినా.. ఆమె రాజీనామాకు ససేమిరా అన్నారు. దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పరిణామాలపై కొండా సురేఖ సాయంత్రం 3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తన బర్త్‌రఫ్‌పై ఆమె ఏం మాట్లాడతారు? ప్రభుత్వ నిర్ణయంపై ఎలాంటి స్పందన ఇస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read : అప్పుడు ఈటల.. ఇప్పుడు కొండా సురేఖ.. బీసీ నేతల బర్త్‌రఫ్!

ఇదిలా ఉంటే.. తెలంగాణలో పలు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు.  తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి ఆమోదం తెలిపారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధారాణి నియామకానికి కూడా ఆమోదం తెలిపారు.

Also Read : హైదరాబాద్‌లో అంతా శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లే…. 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్‌

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.