
SCO Group Photo : మన దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా ఆ సంస్థ సభ్య దేశాల అధినేతలు దిగిన ఫొటోను పాక్ క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భారత ప్రధాని మోదీ లేకుండా ఎస్‌సీఓ గ్రూప్ ఫొటోను ఆ దేశ పీఎంఓ షేర్ చేయడం కలకలం రేపింది. కిర్గిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న 10 సభ్య దేశాల నాయకులు కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. అయితే అందులోంచి ప్రధాని మోదీని క్రాప్ చేసిన ఫొటోను పాక్ ప్రధాని కార్యాలయం (Pakistan PMO)ఎక్స్ లో షేర్ చేయడం గమనార్హం. మోదీతో పాటు మరికొందరు నేతలను కూడా గ్రూపునుంచి తొలగించింది. ఆ ఫోటో లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశాధినేతల మధ్యలో ఉన్నట్లు కనిపించేలా ఫోటోను పోస్ట్ చేసింది. అంటే ఆ సదస్సుకు పాక్ ప్రధాని ఆ సదస్సుకు నాయకత్వం వహిస్తున్నాడే అర్థం వచ్చేలా ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను హైలైట్ చేస్తూ ఫొటో మధ్యలో కనిపించేలా ఎడిట్ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read : నేపాల్ వరదలు.. నీటి ఉధృతిని తట్టుకుని నిలబడ్డ ఇల్లు! కారణం ఏంటో తెలుసా?
ఇటీవల ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం జరిగిన ఎస్‌సీవో సదస్సులో 10 సభ్య దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి గ్రూపు ఫొటో దిగారు. అయితే పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం మాత్రం ఆ ఫోటోను ఎక్స్ లో ఫోస్ట్ చేస్తూ ప్రధాని మోదీని తొలగించడం వివాదానికి దారి తీసింది. ఈ చిత్రంలో మోదీతో పాటు ఇరాన్ అధ్యక్షుడు, మరికొందరు నేతలు కనిపించకుండా చేసింది. ఫొటోను అలా కట్ చేయడం వల్ల షెహబాజ్ షరీఫ్ ఆ గ్రూప్‌లో మధ్యలో ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి పూర్తి ఫొటోలో షెహబాజ్ షరీఫ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన అసలు ఫొటో లో స్పష్టంగా తెలుస్తోంది. అందులో ఎస్‌సీవో నేతలందరితో పాటు షెహబాజ్ షరీఫ్ కూడా స్పష్టంగా కనిపించారు. దీంతో పాకిస్థాన్ చేసిన ఎడిటింగ్ సోషల్ మీడియాలో బట్టబయలైంది.
ఇదొక్కటే కాదు, షెహబాజ్ షరీఫ్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన ఎస్‌సీవో నేతల రౌండ్‌టేబుల్ సమావేశం వీడియోలోనూ మోదీ కనిపించకుండా క్రాప్ చేయడం గమనార్హం. ఈ మేరకు పాకిస్థాన్ చర్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పూర్తి గ్రూప్ ఫొటోలను షేర్ చేస్తూ పాకిస్థాన్ తీరును వారంతా ఎండగడుతున్నారు. కొందరు నెటిజన్లు షెహబాజ్ షరీఫ్ చేతిలో బిక్షాటన పాత్ర ఉన్నట్లుగా ఫొటోలను ఎడిట్ చేసి మరీ పోస్టు చేయడం సంచలనంగా మారింది. గతంలో తాను ఆర్థిక సాయం కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఈ పోస్టులు చేయడం గమనార్హం. అలాగే, పాకిస్థాన్ పీఎంవో ఫొటోను ఇలా కట్ చేయడాన్ని ‘చిన్నపిల్లల సోషల్ మీడియా ట్రిక్’ అంటూ పలువురు విమర్శిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు వేదికగా ప్రధాని మోదీ పాక్ బుద్దిని ఎండగట్టారు. పాక్ ప్రధాని షరీఫ్ సమావేశంలో ఉన్నప్పుడే మాట్లాడుతూ.. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదన్నారు. ఈ క్రమంలోనే పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడడం గమనార్హం.
Also Read : పాకిస్థాన్‌లో 100 ఏళ్లకు పైబడిన హిందూ ఆలయం కూల్చివేత!









