Wednesday, June 3, 22:45
30.2 C
Hyderabad

Donald Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్.. భారత్‌కు లాభమా? నష్టమా?

Trump Backs Down On Steel Tariffs
Trump Backs Down On Steel Tariffs

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే స్టీల్ దిగుమతులపై పన్నులను 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో తయారయ్యే వస్తువుల్లో కనీసం 85 శాతం అమెరికన్ స్టీల్‌నే వాడాలని ట్రంప్ రూల్ పెట్టారు. అమెరికా మార్కెట్లలో విదేశీ వస్తువుల ప్రభావం తగ్గించి.. స్థానిక ఉక్కు పరిశ్రమకు బలం చేకూర్చడం కోసం ఈ రూల్‌ను పెట్టింది. 85 శాతం అమెరికన్ స్టీల్ వాడాలనే నిబంధన వల్ల అక్కడ కంపెనీలు బయటి దేశాల మీద ఆధారపడటం మానేస్తాయి. ఇది అమెరికాలోని ఉక్కు ఉత్పత్తిదారులకు భారీ ఊరటనిస్తుంది. ఉక్కు ధరలను నియంత్రణలో ఉంచడం ద్వారా అక్కడ తయారీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారతీయ ఎగుమతిదారులకు ముఖ్యంగా ఉక్కు, ఇతర ఉక్కు ఆధారిత ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసే కంపెనీలకు ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. దిగుమతి సుంకాలు 15 శాతానికి తగ్గడం వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికాలో కొంత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అయితే 85 శాతం అమెరికన్ స్టీల్ నిబంధనను పాటించాల్సిన బాధ్యత అమెరికా కంపెనీలపై ఉంది. కాబట్టి భారతీయ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING :  ఘోరం.. రెండు బస్సులు ఢీ… ఏడుగురు మృతి!

ప్రపంచవ్యాప్తంగా ఉక్కు వాణిజ్యంపై ఈ నిర్ణయం పెద్ద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల నుంచి వచ్చే చౌక ఉక్కుపై అమెరికా గట్టి పట్టు సాధించాలనుకుంటోంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌లో ఉక్కు ధరలు పెరగవచ్చని.. ఇది భారత్ వంటి దేశాల నుంచి స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఇతర దేశాలకు కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ ఇప్పుడు తన ఎగుమతుల సామర్థ్యాన్ని అమెరికా నిబంధనలకు అనుగుణంగా మార్చుకుంటే.. ఈ మార్పు నుంచి ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: భక్తి ముసుగులో IIT కామాంధుడు….ప్రవచనాలు చెబుతూ  అమ్మాయిలతో రాసలీలాలు!