బ్రిటన్‌లో కొన్ని ముఠాలు చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలను, మహిళలను లైంగికంగా వేధిస్తున్నాయి. ఈ విషయం గురించి బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు తాజాగా చర్చించారు. బ్రిటన్ ఎంపీ రూపెల్ట్ లోవ్ పార్లమెంటులో మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలను వివరించారు. ఓ బాధితురాలు తాను మైనర్‌గా ఉన్నప్పుడే లైంగిక దాడికి గురైనట్లు చెప్పగా, మరో బాధితురాలు అయితే తనపై మూడేళ్ల కాలంలో సుమారు 600 నుండి 700 మంది అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ముఠాల సభ్యులు బాధితులను మనుషులుగా కాకుండా జంతువుల కంటే హీనంగా చూశారని.. వారిపై తీవ్రమైన శారీరక హింసకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ముఠాలు ప్రధానంగా శ్వేతజాతీయులైన మహిళలు, బాలికలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: భక్తి ముసుగులో IIT కామాంధుడు….ప్రవచనాలు చెబుతూ అమ్మాయిలతో రాసలీలాలు!
ఇది కూడా చూడండి: BIG BREAKING : ఘోరం.. రెండు బస్సులు ఢీ… ఏడుగురు మృతి!
పాకిస్తాన్‌కు చెందిన వారే ఎక్కువ..
ఈ లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తులు ఉన్నారు. ఇందులో ట్యాక్సీ డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఎక్కువగా ఉన్నారని గతంలోనే దర్యాప్తులో తేలింది. ఇవి ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రోచ్‌డేల్, రోథర్‌హ్యామ్, ఓల్డ్‌హ్యామ్, టెల్ఫోర్డ్ వంటి దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయని దర్యాప్తులో వెల్లడైంది. 2002లోనే ఈ దారుణాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చినప్పటికీ, బాధితులకు సరైన న్యాయం జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: CBSEలో మోదీ ప్రభుత్వం భారీ ప్రక్షాళన.. చైర్మన్, సెక్రటరీలపై బదిలీ వేటు!
ఈ కేసుల్లో కేవలం ముఠా సభ్యుల పాత్ర మాత్రమే కాకుండా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, అధికారులు వాటిని స్వీకరించడానికి వెనకాడుతున్నారు. అలాగే సరైన దర్యాప్తు చేయకపోవడం వల్ల ఈ నేరగాళ్లు మరింత రెచ్చిపోయారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని, బాధితుల బాధలను పట్టించుకోలేదని అనేకమంది సాక్షులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Mamata Banerjee : మమతా బెనర్జీకి దిమ్మతిరిగే షాక్.. MLA లంతా ధర్నాకు డుమ్మా!










