Wednesday, June 3, 22:45
30.2 C
Hyderabad

BIG BREAKING: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

dk shivakumar
dk shivakumar

BIG BREAKING: కర్ణాటక 35వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణం చేయించారు. డీకే క్యాబినేట్ లో 13 మంది మంత్రులకు చోటు దక్కింది. జి. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా..  యతీంద్ర సిద్దరామయ్య, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్ పేర్లు ఉన్నాయి.  రాజ్యసభ ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. యూటీ ఖాదర్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఆయననకు మంత్రి వర్గంలో చోటు దక్కింది.

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విడి సతీషన్ (కేరళ), రేవంత్ రెడ్డి (తెలంగాణ),  సుఖ్వీందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) హాజరయ్యారు.