
బైక్ రైడింగ్ ప్రియులను పిచ్చెక్కించే సరికొత్త బైక్ మార్కెట్‌లోకి వచ్చింది. దాని ఫీచర్స్, డిజైన్, హార్స్ పవర్ తెలిస్తే కచ్చితంగా మెంటల్ ఎక్కాల్సిందే. ప్రముఖ బ్రిటిష్ స్టార్టప్ కంపెనీ వెలోస్ మోటార్ సైకిల్స్.. ఈ సరికొత్త బైక్‌ను తాజాగా ఆవిష్కరించింది. లండన్‌లో జరిగిన బైక్ షెడ్ మోటో షోలో దీనిని ప్రదర్శించింది. ఈ శక్తివంతమైన బైక్‌కు కంపెనీ ‘వెలోస్ అపెరియన్’ (veloce aperion) అనే పేరు పెట్టింది. కాగా ఇలాంటి మోస్ట్ పవర్ ఫుల్ బైక్‌లు కేవలం రేసింగ్‌లలో మాత్రమే వాడుతారు. కానీ ఈ veloce aperion బైక్‌ను రోడ్లపై కూడా నడుపుకునేందుకు వీలుగా అక్కడి యూకే ప్రభుత్వం అనుమతించింది. ఇప్పుడు దీని ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం, ధర గురించి తెలుసుకుందాం.
Also Read : ఫ్రాన్స్‌లో ఎండలకు వెయ్యిమంది బలి..కారణం అమెరికానే అంటోన్న జనం..ఎందుకో తెలుసా?
Veloce Aperion Engine And Design
veloce aperion బైక్‌లో భారీ 1000cc సామర్థ్యం గల ‘X8’ టూ-స్ట్రోక్ ఇంజిన్ అమర్చారు. ఇందులో 8 సిలిండర్లను అందించారు. ఇవి గేర్ బాగ్స్ చుట్టూ X ఆకారంలో ఉంటాయి. దీనివల్ల బైక్ చాలా స్లిమ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇక దీని పవర్ విషయానికొస్తే.. దీని ఇంజిన్ 12,000 rpm వద్ద 280hp అత్యధిక శక్తిని విడుదల చేస్తుంది. అంటే ఇది రేసింగ్ కార్ల స్థాయిలో భీకరమైన వేగంతో లోపల రన్ అవుతుంది. ఇక 280hp (హార్స్‌పవర్).. అంటే దాదాపు 280 గుర్రాలు కలిసి ఒకేసారి లాగితే ఎంత బలం వస్తుందో.. ఈ ఒక్క బైక్ ఇంజిన్‌కి అంత బలం ఉంటుందని అర్థం.
కాగా ఇందులో 8 సిలిండర్లకు సరిపోయేలా 8 సైలెన్సర్ పైపులను అమర్చడం ఇంజినీర్లకు పెద్ద సవాలుగా మారింది. దీనికోసం కంపెనీ ఆధునిక లేజర్ సింటెర్డ్ ఆల్ అలాయ్ 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. దీని కారణంగా సైలెన్సర్ పైపులు ఇంజిన్ చుట్టూ బాగా అమరిపోయాయి. ఇక దీని చాసిస్ విషయానికొస్తే.. ఇంజిన్, గేర్‌బాక్స్, ట్రాన్స్‌మిషన్ అన్నీ కలిపి ఒకే సింగిల్ స్ట్రక్చరల్ యూనిట్‌గా పనిచేస్తాయి.
Also Read : ప్రపంచకప్‌లో ‘ఫిక్సింగ్’ కలకలం: రియాద్ మహ్రెజ్ వ్యాఖ్యలతో రచ్చ..
Veloce Aperion Price
veloce aperion ధర విషయానికొస్తే.. కంపెనీ దీని ధరను రూ.97.15 లక్షలుగా నిర్ణయించింది. అంతేకాకుండా ఇవి చాలా రేర్ పీస్‌లు కాబట్టి.. కేవలం 24 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేసి మార్కెట్‌లో తీసుకురానుంది. ఈ బైక్ డెలివరీలు వచ్చే ఏడాది 2027 నుంచి ప్రారంభం కానున్నాయి.









