Donald Trump
Donald Trump

రష్యాపై ఉన్న కోపంతో ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చిరించినా అమెరికా అన్నంత పనిచేసింది. రష్యాను శిక్షించే క్రమంలో ఆ దేశంతో పాటు భారత్‌, చైనా తదితర దేశాలపై 100 అదనపు టారిప్‌లు విధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు.. అమెరికా సెనేట్‌ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపడం గమనార్హం. రష్యాతో పాటు, ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని కొంటున్న దేశాలపై ఆంక్షలు విధించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి భారత్, చైనా ఇతర దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల పరోక్షంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆ దేశాలు సాయపడుతున్నట్లేనని అమెరికా అభిప్రాయపడుతోంది. ఆ అభిప్రాయంతోనే ఈ బిల్లును తీసుకువచ్చింది. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకుంటున్న అగ్ర శ్రేణి ఐదు దేశాలపై 100% టారిఫ్‌ల విధించడానికి అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇది అధికారమచ్చినట్లయింది. దీంతో రష్యా నుంచి ఇంధన దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్, అజర్‌బైజాన్, హంగరీ, స్లొవేకియాలపై ఈ ప్రభావం పడనుంది. ఇదే బిల్లులో ఇరాన్‌ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఆంక్షలు విధించే చట్టాన్ని పొడిగించడం కూడా ఉంది.. దీనిపై ప్రతినిధుల సభ ఈ నెల 31న నిర్ణయం తీసుకోనుంది.

ఈ బిల్లుకు భారీ మెజారిటీ లభించింది. బిల్లుకు అనుకూలంగా 86మంది ఓటు వేయగా, 11మంది మాత్రమే వ్యతిరేకించారు. రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు, ఇతర ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న ఈ ఐదు దేశాలపై టారీఫ్‌లు, ఆంక్షలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టేబెట్టేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుంది. దీని ప్రకారం ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. రిపబ్లికన్లకు మెజారిటీ కలిగిన ప్రతినిధుల సభ ఆమోదం తెలిపితే, అధ్యక్షుడు ట్రంప్‌ సంతకంతో ఈ చట్టం అమల్లోకి రానుంది. ప్రముఖ రిపబ్లికన్‌ నేత లిండ్సే ఓ గ్రాహమ్‌ ఈ బిల్లును ప్రతిపాదించడం గమనార్హం. ఆయన ఈ ఏడాది జూలై 11న ఆయన హఠాన్మరణం చెండాడు. దీంతో బిల్లు పేరును ‘లిండ్సే గ్రాహమ్‌ రష్యా, ఇరాన్‌ ఆంక్షల చట్టం 2026’అని పెట్టడం గమనార్హం. ఉక్రెయిన్‌కు మద్దతుగా, రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీసే లక్ష్యంతో గ్రాహమ్‌తోపాటు డెమొక్రాట్‌ రిచర్డ్‌ బ్లుమెంతల్‌ ఈ బిల్లును ప్రతిపాదించారు. చైనా, భారత్‌ తదితర దేశాలు రష్యా నుంచి చౌక చమురు కొనుగోలు చేస్తూ, ఆ డబ్బును ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాయని అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది. భారత దేశం దిగుమతి చేసుకుంటున్న చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40శాతానికి పైగా ఉంది. అయితే, అమెరికా, భారత్‌ మధ్య ట్రేడ్‌ డీల్‌ అమల్లోకి వస్తే ఈ అదనపు సంకాల నుంచి భారత్‌కు మినహాయింపు లభించే అవకాశం ఉందని భారత ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.