Donald Trump
Donald Trump

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికా కేంద్ర సైనిక దళం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టింది. అధునాతన క్షిపణులు, డ్రోన్ల సహాయంతో ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను, కీలక సైనిక స్థావరాలను అమెరికా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై అమెరికా స్పందిస్తూ.. ఇరాన్ గత కొంతకాలంగా అనుసరిస్తున్న దూకుడు వైఖరి వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

https://x.com/SriLankaTweet/status/2064870425000391035

తగిన బుద్ధి చెప్పడమే..

ఇరాన్ చేస్తున్న రెచ్చగొట్టే చర్యలకు తగిన సమాధానం చెప్పడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడుల కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అకృత్యాలను సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్‌పై మరింత తీవ్రమైన దాడులు చేస్తామని ఆయన బహిరంగంగానే పేర్కొన్నారు. అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడులకు పాల్పడింది.