US-Iran War
US-Iran War

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లో ఇటీవల జరిగిన చర్చల అనంతరం కుదిరే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇరాన్ కచ్చితంగా గౌరవించాల్సిందేనని, ఒకవేళ ఇరాన్ నిబంధనలను ఉల్లంఘిస్తే తాము కఠినమైన సైనిక చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమను గౌరవించినంత కాలం ఎలాంటి సమస్యలు ఉండవని, కానీ సరిగ్గా ప్రవర్తించకపోతే తాను చేయాల్సింది చేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు.

Also Read : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. వీడియోలు వైరల్‌!

Trump Warning To Iran

ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందనే మాటలను ట్రంప్ కొట్టిపారేశారు. ఆర్థిక మాంద్యం కంటే ఇరాన్ అణు ఆయుధాలు కలిగి ఉండటమే ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమని, అణు బాంబుల వల్లే ప్రపంచం మరింత వేగంగా నాశనమవుతుందన్నారు. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో జరిగిన మొదటి రౌండ్ సాంకేతిక చర్చలు సాఫీగా సాగాయని, ఖచ్చితమైన తుది ఒప్పందానికి బలమైన పునాది పడిందని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. అలాగే ఇరాన్ తమ దేశంలో అంతర్జాతీయ అణు తనిఖీలకు అంగీకరించిందని వాన్స్, ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ ఈ వాదనలను తప్పు పట్టారు. అంతర్జాతీయ అణు ఇంధన ఎనర్జీ ఏజెన్సీతో సంబంధాలు, తనిఖీలు కేవలం తమ దేశ చట్టాలు, నిబంధనలు ముందస్తు ఒప్పందాల ప్రకారమే జరుగుతాయన్నారు. అమెరికా చెప్తున్నట్లు కాదని స్పష్టం చేశారు.

Also Read : మిడిల్ ఈస్ట్ లో శాంతి దిశగా కీలక పరిణామం… స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు