Dubai Tel Aviv Flight : పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో యూఏఈ, దుబాయ్‌ తదితర దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ కి చెందిన విమానం హైజాక్‌ కు గురయినట్లు సంకేతాలు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన విమానం టెల్‌ అవీవ్‌కు బయలు దేరిన కొన్ని క్షణాల్లోనే విమానంలో హైజాక్‌ అలర్ట్‌ అలారం మోగింది. విమానం నుంచి అత్యవసర సంకేతాలు రావడంతో ఇజ్రాయెల్‌ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ విమాన రక్షణకు ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించడంతో కలకలం చెలరేగింది.

Also Read : రష్యా సైనికులకు బిగ్ షాక్‌… జాంబీ కార్లతో ఉక్రెయిన్‌ అటాక్‌

ఫ్లైదుబాయ్‌ కంపెనీకి చెందిన FZ1073 విమానం ఈ రోజు (బుధవారం) సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తుంది. ఈ సమయంలో విమానం నుంచి రెండు అత్యవసర కోడ్‌లను ప్రసారమైనట్లు ఇజ్రాయెల్‌ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఒక కోడ్‌ ప్రకారం విమానాన్ని హైజాక్‌ చేసే అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం ముందస్తు జాగ్రత్తగా ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళన మొదలైంది. అయితే అధికారులు మాత్రం విమానంలో ఉన్న ప్రయాణికులు..సిబ్బంది భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.

హైజాక్‌ అనుమానాస్పద సంకేతాలు వెలువడిన వెంటనే FZ1073 విమానాన్ని టెల్ అవీవ్‌కు వెళ్లకుండా సౌదీ అరేబియాకు మళ్లించారు. ఈ పరిణామంతో విమాన ప్రయాణికులు ఆందోళనకు గురికాక, ఇజ్రాయెల్‌లో భద్రతా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.. అత్యవసర కోడ్‌లు ఎందుకు ప్రసారమయ్యాయి, వాటి వెనుక అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. అయితే.. విమానం నుంచి హైజాక్‌ సంకేతాలు రావడానికి కారణాలు ఏంటీ? ఆ సమయంలో విమానంలో అసలు ఏం జరిగిందన్న దానిపై అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Also Read : ట్రంప్ సంచలన ప్రకటన.. AI పేరు మార్చేసిన అమెరికా ప్రెసిడెంట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.