China : చైనాలో జననాల రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో గర్భధారణ నుంచి ప్రసవం, ప్రసవం తర్వాత వైద్య పరీక్షల వరకు అయ్యే ఖర్చులను పూర్తిగా ఉచితంగా అందించనుంది. చైనాలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ, పిల్లల జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. గర్భధారణ సమయంలో చేసే పరీక్షలు, ఆసుపత్రిలో ప్రసవం, ప్రసవం తర్వాత చేసే వైద్య పరీక్షలకు మహిళలు తమ జేబు నుంచి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ చర్యతో పిల్లలను కనడానికి కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : అమెరికాపై దాడికి రెండ్రోజుల ముందు ప్రత్యర్థి హత్య…తాలిబన్ల మొప్పు కోసం లాడెన్‌ దుశ్చర్య

అక్టోబర్ నుంచి నగరంలోని మెడికల్ ఇన్సూరెన్స్ పథకంలో ఉన్న ప్రతి మహిళకు 4,500 యువాన్లు (సుమారు రూ.60 వేలకుపైగా) ప్రసూతి భత్యంగా అందుతుంది. వైద్య ఖర్చులు ఈ మొత్తాన్ని మించితే.. మిగిలిన మొత్తాన్ని ప్రసూతి బీమా ద్వారా చెల్లిస్తారు. గర్భధారణ సమయంలో చేసే వైద్య పరీక్షలు, ఆసుపత్రిలో ప్రసవం, ప్రసవం తర్వాత 42 రోజుల వరకు అవసరమయ్యే వైద్య సేవల ఖర్చులను కూడా పూర్తిగా తిరిగి చెల్లిస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. అంటే గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాతి చికిత్సల వరకు మహిళలకు పెద్దగా ఖర్చు ఉండదు.

చైనాలో జననాల రేటు తగ్గిపోవడంతో పాటు పని చేసే వయసులో ఉన్న ప్రజల సంఖ్య కూడా తగ్గుతోంది. అదే సమయంలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. దీంతో వృద్ధుల సంఖ్య పెరిగి.. దేశ జనాభా నిర్మాణంలో భారీ మార్పులు వస్తున్నాయి. ఇది భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనాలో ఈ జనాభా సమస్యకు దశాబ్దాల పాటు అమలైన ఒకే బిడ్డ విధానం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. జననాల రేటు తగ్గిపోవడంతో 2016లో చైనా ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసి.. దంపతులు ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతించింది.

Also Read : ఎన్నికల తర్వాతే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.