SYRIA : అసాధారణ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిరియా దేశపు మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఆ దేశ క్రిమినల్‌ కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలివరించింది. ఆయనతోపాటు ఆయన సోదరుడు మాహ్‌‌ అల్ అసద్‌, బంధువు అతేఫ్ నజీబ్‌కు కూడా మరణ శిక్ష విధించింది. సిరియాలో దాదాపు 14 ఏళ్ల పాటు తీవ్ర అంతర్యుద్ధం సాగింది. ఈ యుద్ధం లో సామూహిక హత్యలు, చిత్రహింసలు, అక్రమ అరెస్టులు, మానవాళికి వ్యతిరేకంగా ఆయన యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

Also Read : బాబ్‌ అల్‌ మాండెబ్‌లో నౌకపై హూతీల దాడి…ముగ్గురు నావికులు మృతి

ఆయన కోర్టులో లేకపోయినప్పటికీ పరోక్షంగా జరిపిన విచారణలో న్యాయస్థానం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పసిపిల్లలతో సహా పలువురిని పక్కా ప్రణాళికతో హత్య చేయడం, బంధించిన వారిని చిత్రహింసలకు గురిచేయడం.. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడటం వంటి అనేక తీవ్ర నేరాలకు అసద్ బాధ్యుడని కోర్టు స్పష్టం చేసింది. అసద్‌తో పాటు ఆయన సోదరుడు, పాలనలో కీలక భద్రతాధికారిగా వ్యవహరించిన అతెఫ్ నజీబ్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అసద్ బంధువు అతేఫ్ నజీబ్‌ సౌత్‌ దారా ప్రావిన్స్‌లో అణచివేతకు పాల్పడినందుకు మరణదండన విధించింది

ఇక మరణశిక్ష విధించిన మాజీ అధ్యక్షుడు బషార్ అల్-అసద్‌తో పాటు ఆయన సోదరుడు మహేర్ అల్-అసద్‌. బంధవు అతెఫ్‌నును అంతర్జాతీయంగా అరెస్ట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. 2000వ సంవత్సరంలో తన తండ్రి హఫీజ్ అల్-అసద్ మరణించిన తర్వాత బషార్ అల్-అసద్ సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో ‘అరబ్ స్ప్రింగ్’ ఉద్యమం పేరుతో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం రోడ్లపైకి వచ్చారు. అయితే ప్రజలపై అసద్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన బలప్రయోగానికి దిగింది. అది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసింది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు అసద్ కుటుంబ పాలన, డిసెంబర్ 2024లో తిరుగుబాటు దారులు చేపట్టిన మెరుపు దాడితో అంతమొందింది. 2024 డిసెంబర్‌ లో తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు, దీన్ని ముందే గ్రహించిన అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయి, ప్రస్తుతం మాస్కోలో ఆశ్రయం పొందుతున్నారు. అధికార మార్పిడి తర్వాత ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం అసద్ హయాంలో జరిగిన అరాచకాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించడంతో కోర్టు కీలక తీర్పునిచ్చింది. కాగా, సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికిపైగా మృతి చెందారని అంచనా.

Also Read : పాకిస్తాన్‌పై తిరుగుబాటు.. కొత్త దేశంగా బలూచిస్థాన్..!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.