
పాకిస్థాన్‌లో మళ్లీ రగిలిపోతున్న ప్రాంతం.. బలూచిస్థాన్! సెంట్రల్ బలూచిస్థాన్‌లో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సురబ్ జిల్లాలో రాత్రిపూట జనం బయటకు రావడానికి వీల్లేకుండా కర్ఫ్యూ విధించారు. మరోవైపు పక్కనే ఉన్న ఖుజ్దార్ జిల్లాలో వ్యాపారాలన్నీ బంద్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. అసలు బలూచిస్థాన్‌లో ఏం జరుగుతోంది? ఒకవైపు అర్ధరాత్రి కర్ఫ్యూలు.. ఇంకోవైపు 19 ఏళ్ల కుర్రాడి మిస్సింగ్ కథలు.. మరోవైపు బహిరంగ హత్యలు! అసలు అక్కడ సెక్యూరిటీ దళాలు ఏం చేస్తున్నాయి? హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఎందుకు భయపడుతున్నాయి? డీటైల్డ్‌గా తెలుసుకుందాం.
ముందుగా సురబ్ జిల్లా విషయానికొస్తే.. అక్కడ పరిస్థితి ఒక్కసారిగా చేతులు దాటిపోయింది. అందుకే జిల్లా అధికారులు అర్జెంట్‌గా ఒక నోటీస్ ఇచ్చారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. టైమింగ్స్ ఏంటంటే.. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు! అంటే ఏకంగా 13 గంటల పాటు జనం ఇళ్లలోనే బందీగా ఉండాలి. అత్యవసర పనులున్నా సరే బయటకు రావడానికి పర్మిషన్ లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడడానికే ఈ డిసిషన్ అని అధికారులు చెప్తూనే, రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
ఇక సురబ్ పక్కనే ఉన్న ఖుజ్దార్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ పూర్తి కర్ఫ్యూ పెట్టకపోయినా.. రాత్రిపూట బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని ఆపేశారు. రాత్రి 8 నుంచి ఉదయం 10 గంటల వరకు మార్కెట్లు, షాపులు, హోటళ్లు అన్నీ క్లోజ్ చేయాల్సిందే. బలూచిస్థాన్‌లో ఎండలు ఎక్కువ కాబట్టి, జనం నైట్ టైమ్‌లోనే ఎక్కువ బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటారు. అలాంటి టైమ్‌లోనే ఇన్ని ఆంక్షలు పెట్టడంతో స్థానిక వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
అయితే అధికారులు మాత్రం ఇది కేవలం సెక్యూరిటీ కోసమే అని కవర్ చేస్తున్నారు. కానీ అసలు కథ వేరే ఉందంటున్నారు బలూచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు. ఇటీవల జరిగిన కొన్ని ఘోరమైన సంఘటనలే ఈ ఆంక్షలకు మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. అందులో మొదటిది.. సురబ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల కూలీ సయీద్ అహ్మద్ మిస్సింగ్ కేస్. గత నెలలో ఈ యంగ్ కుర్రాడిని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI, ఫ్రాంటియర్ కార్ప్స్ కలిసి బలవంతంగా ఎత్తుకెళ్లాయని హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఓపెన్‌గా ఆరోపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : సిరియా కోర్టు సంచలన తీర్పు…మాజీ అధ్యక్షునితో పాటు మరో ఇద్దరికీ మరణశిక్ష
ఇది చాలదన్నట్టు ఖుజ్దార్‌లో జరిగిన ఒక దారుణ హత్య అక్కడ మరింత మంట రాజేసింది. ఆగస్టు 4న ఇనాయతుల్లా జట్టక్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చి చంపేశారు. విచిత్రం ఏంటంటే.. ఆయన చనిపోవడానికి కొద్ది గంటల ముందే ఆయన కూతురు ఒక వీడియో రిలీజ్ చేసింది. ‘డెత్ స్క్వాడ్’ మనుషుల నుంచి తన తండ్రికి, కుటుంబానికి ప్రాణహాని ఉందని, కాపాడాలని ఏడుస్తూ వేడుకుంది. ఆ వీడియో వైరల్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురికావడం అందరినీ షాక్‌కి గురిచేసింది.
అసలు బలూచిస్థాన్‌లో ఇలాంటి అదృశ్యాలు, హత్యలు కొత్తేమీ కాదు. పాకిస్థాన్‌లో ఏరియా పరంగా బలూచిస్థాన్ అతిపెద్ద ప్రావిన్స్. గ్యాస్, ఖనిజాలు లాంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం తమను పీల్చి పిప్పి చేస్తోందని, ఏమాత్రం డెవలప్‌మెంట్ చేయకుండా తమ హక్కులను కాలరాస్తోందని బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇక్కడ స్వేచ్ఛ కోసం పోరాడే తిరుగుబాటుదారులకు, పాకిస్థాన్ మిలిటరీకి మధ్య నిత్యం పోరు జరుగుతూనే ఉంటుంది.
తుపాకులు, కర్ఫ్యూలతో బలూచిస్థాన్ ప్రజల నోళ్లను తాత్కాలికంగా నొక్కేయవచ్చేమో కానీ.. పాకిస్థాన్ రాక్షస పాలనపై రగులుతున్న తిరుగుబాటు జ్వాలలను మాత్రం ఆపలేరు. అమాయక యువకుల అదృశ్యాలు, ప్రభుత్వ నిఘా వర్గాల హత్యలకు పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
Also Read : ఐదు దశాబ్దాల నష్టాలకు పరిహారం చెల్లించాల్సిందే…ఇరాన్‌కు ట్రంప్ మరో డిమాండ్









