Marco Rubio : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి 60 రోజుల పాటు ఈ చర్యలను పక్కన పెట్టి.. వాటి వల్ల అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించాలని ట్రంప్ నిర్ణయించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ప్రస్తుతానికి ఊరట లభించింది.

రష్యాపై ఆంక్షలు విధించడం మాత్రమే కాకుండా.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కూడా టారిఫ్‌లు విధిస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని అమెరికా భావిస్తోంది. అందుకే వెంటనే నిర్ణయం తీసుకోకుండా 60 రోజుల సమయం తీసుకోవాలని ట్రంప్ నిర్ణయించినట్లు రూబియో చెప్పారు. ఆంక్షలు, టారిఫ్‌లు విధిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే విషయాలను ఈ 60 రోజుల్లో పరిశీలించాలని రూబియో తెలిపారు.

Also Read : సముద్రంలో ఐఫోన్లు.. ఇరాన్‌లో జనం పరుగులు? అసలు నిజం ఇదే!

అంటే ఈ 60 రోజులు భారత్‌కు పూర్తిగా సమస్య తొలగిపోయినట్లు కాదు. ప్రస్తుతానికి టారిఫ్‌ల నుంచి ఊరట మాత్రమే. 60 రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం మళ్లీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే భారత్ ఒక్క రష్యాపైనే ఆధారపడటం లేదని రూబియో చెప్పారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తూ తన ఇంధన అవసరాలను కొంతవరకు మార్చుకుంది. అయినా రష్యా నుంచి వస్తున్న చమురు వాటా ఇంకా ఎక్కువగానే ఉంది. దీన్ని ఒక్కసారిగా ఆపేయడం అంత సులభం కాదని రూబియో చెప్పారు.

భారత్ తన ఇంధన కొనుగోళ్లను ఇప్పటికే మార్చుకుంటోంది. కానీ రష్యా నుంచి ఇప్పటికీ పెద్ద మొత్తంలో చమురు వస్తోంది. ఒక్కరోజులో దాన్ని పూర్తిగా మార్చేయడం కష్టమని ఆయన అన్నారు. రష్యా నుంచి వచ్చే చమురును ఒక్కసారిగా ఆపేస్తే భారత్ ఇతర దేశాల నుంచి ఎక్కువగా చమురు కొనాల్సి రావచ్చు. అలా చేస్తే కొత్త సరఫరా మార్గాలు ఏర్పాటు చేయాలి. ధరలు కూడా మారే అవకాశం ఉంటుంది. చమురు కొనుగోలు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అందుకే అమెరికా కూడా భారత్ వెంటనే రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలని చెప్పడం అంత సులభమైన విషయం కాదని అర్థం చేసుకుంటున్నట్లు రూబియో వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

Also Read : నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్.. ఇప్పుడు మరో దేశంలో విద్యార్థుల తిరుగుబాటు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.