
Hormuz : హార్ముజ్ జలసంధి దగ్గర ఓ కార్గో నౌక మునిగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సముద్రంలో తేలుతున్న ఐఫోన్లు, ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్‌లు, ఇతర ఖరీదైన వస్తువులను తీసుకోవడానికి ఇరాన్‌కు చెందిన మత్స్యకారులు, స్థానికులు పడవల్లో వెళ్లారంటూ ఈ వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. చిన్న పడవతో ఏకంగా ఓ పెద్ద షిప్పింగ్ కంటైనర్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొన్ని వీడియోల్లో సముద్రంలో తేలుతున్న కంటైనర్లు, పెట్టెల మధ్య చిన్న పడవలు తిరుగుతున్నట్లు, అందులో ఉన్నవాళ్లు వస్తువులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలు నిజమైనవేనా? అందులో కనిపిస్తున్న వస్తువులు నిజంగా మునిగిపోయిన నౌకకు చెందినవేనా? అనే విషయంలో ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
The Strait of HORMUZ has become the world’s most dangerous APPLE STORE
After the container ship GFS Pride sank with more than 2,500 containers aboard, Iranian fishermen have been heading out to sea to collect floating iPhones, French perfumes and whatever else the Gulf has decided to deliver.
One small boat was even filmed trying to tow an entire shipping container.
All 21 crew members survived, thankfully.
— China Perspective (@China_Fact) October 17, 2026
కొన్ని వీడియోలు ఏఐతో తయారు చేసినవి కావచ్చని ఫ్యాక్ట్ చెక్ బృందాలు చెబుతున్నాయి. అల్ జజీరా చేసిన ఓ పరిశీలనలో.. ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్‌లను సముద్రం నుంచి తీసుకుంటున్నట్లు చూపించిన పలు వైరల్ వీడియోలు నకిలీవని తేల్చినట్లు తెలిపింది. అక్టోబర్ 17న ప్రచురించిన అల్ జజీరా ఓపెన్ సోర్స్ పరిశీలనలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలను పరిశీలించారు. వాటిలో కొన్ని వీడియోలు నిజమైన ఘటనలకు సంబంధించినవి కావని గుర్తించారు. మరోవైపు నౌక మునిగిన తర్వాత ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఐఫోన్ బాక్సులు అంటూ ఆ వీడియోను ప్రచారం చేశారు. అయితే ఆ వీడియోను పరిశీలించిన ఓ ప్రత్యేక టూల్.. అది ఏఐతో తయారు చేసిన వీడియో అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చూపించినట్లు ఫ్యాక్ట్ చెక్ బృందం తెలిపింది. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఇరాన్‌లో జనం ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్‌ల కోసం సముద్రంలోకి వెళ్లారు” అనే విషయం ఇప్పటివరకు పూర్తిగా నిజమని నిర్ధారణ కాలేదు.
Also Read : అందుకే ట్రంప్ టారిప్స్ రద్దు చేశారు : మార్కో రూబియో సంచలన కామెంట్స్
అసలు నౌకకు ఏం జరిగింది?
ఈ వీడియోలు వైరల్ కావడానికి కారణమైన నౌక పేరు GFS Pride. ఇది సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సమయంలో నౌకకు నష్టం జరిగింది. ఆ తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. చివరికి అది సముద్రంలో మునిగిపోయింది సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ ప్రకారం.. నౌకలో ఉన్న మొత్తం 21 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. GFS Pride నౌకలో 2,824 TEUల వరకు కంటైనర్లు తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. TEU అంటే సాధారణంగా 20 అడుగుల కంటైనర్‌కు ఉపయోగించే కొలత. అయితే నౌక ఎందుకు మునిగింది అనే విషయంలో ఇరాన్, ఇతర అధికారులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ మాత్రం.. ఆ నౌక అనుమతి లేని ప్రమాదకరమైన మార్గంలోకి వెళ్లిందని, అక్కడ సముద్రంలో ఉన్న మైన్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని చెప్పింది. అయితే నౌక మునిగిన అసలు కారణం ఏంటి? అందులో ఏ వస్తువులు ఉన్నాయి? అనే విషయాలపై ఇంకా పూర్తి సమాచారం లేదు. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్‌ల కథనాలను నౌక మునక ఘటనతో నేరుగా కలిపి నిజమని చెప్పలేమని అధికారులు, ఫ్యాక్ట్ చెక్ బృందాలు చెబుతున్నాయి.
Also Read : ట్రంప్–పుతిన్ డీజిల్ డీల్.. జెలెన్‌స్కీకి బిగ్ షాక్









