
BIG BREAKING :ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో సంభవించిన భారీ భూకంపాలు ప్రజలను వణికించాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బుధవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. అక్కడ ఉన్న మెండోసినో కౌంటీలో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ఈ భూమి కంపించింది. కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ వ్యాలీకి ఉత్తరంగా 11 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో ప్రముఖ నగరం శాన్ఫ్రాన్సిస్కోలో కూడా భూప్రకంపనలు రావడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం కాలిఫోర్నియా ప్రభుత్వం రంగంలోకి దిగి అన్ని అత్యవసర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
మరోవైపు, వెనిజులా దేశంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడ కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండుసార్లు భూమి అత్యంత శక్తివంతంగా కంపించింది. ఈ వరుస భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1, 7.5గా నమోదైంది. గత శతాబ్ద కాలంలో వెనిజులాలో సంభవించిన అత్యంత బలమైన భూకంపాలు ఇవేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకంపనల ధాటికి రాజధాని కరాకస్‌తో పాటు పలు నగరాల్లో పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. నగరాల్లో దట్టమైన ధూళి మేఘాలు కమ్ముకున్నాయి.
Also Read : వెనెజువెలాలో శతాబ్దపు మహా విపత్తు… స్పాట్లో లక్షమంది… శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..?
700 మందికి పైగా
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కనీసం 32 మంది మరణించారని, 700 మందికి పైగా గాయపడ్డారని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. నష్టం ఊహించని స్థాయిలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ప్రళయం కారణంగా వెనిజులాలో దాదాపు 10 వేల నుండి లక్ష మంది వరకు చనిపోయి ఉండవచ్చని భయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఉక్రెయిన్ న్యూ ప్లాన్.. రష్యా సైనికులకు ఎరగా అందగత్తెలు.. ఏం చేస్తున్నారో తెలుసా?









