
South Africa : విమానాలు ఆకాశం నుంచి కొంచెం కిందకు వస్తేనే విపరీతమైన భయం వేస్తోంది. అలాంటిది రెండు భారీ విమానాలు వేలాది మంది మీదనుంచి అతి సమీపంగా పోతే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటిదే దక్షిదక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. దక్షిదక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ మైదానంలో పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంబురాల ప్రారంభం సందర్భంగా పలు విన్యాసాలు ప్రదర్శించారు. ఆ నేపథ్యంలోనే చేసిన ఓ విన్యాసం ప్రేక్షకుల గుండెలు ఆగినంత పనైంది. స్థానిక డీహెచ్‌ఎల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య రగ్బీ మ్యాచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక వేడుకలలో భాగంగా రెండు విమానాలతో ఫ్లైపాస్ నిర్వహించారు. ఈ క్రమంలో రెండు ‘ఎయిర్‌లింక్’ విమానాలు మైదానం పైకప్పునకు దాదాపు తాకుతూ వెళ్లినట్లు ప్రయాణించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు.
look how low this flyover looked. two airlink passenger jets just flew over dhl stadium in cape town ahead of the springboks vs. all blacks match. pic.twitter.com/5r5nB1j9ti
— Michael Rusch (@weeddude) August 29, 2026
ఆ విమానాలు స్డేడియం పై కప్పునకు తగులతాయోమో అన్నంతంగా కిందనుంచి వెళ్లడంతో అంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో మైదానంలో సుమారు55 వేల మంది ప్రేక్షకులు ఉన్నారు ఈ విమానాలు పైకప్పునకు కేవలం 40-46 అడుగుల ఎత్తులో మాత్రమే ఎగిరినట్లు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ప్రేక్షకులు చెబుతున్నారు. కాగా విమానాల విన్యాసాలు లైవ్‌లో ప్రసారం అయ్యాయి. ఆ విమనాలు మైదానంపై ఎగురుతున్న వేళ.. భూమి నుంచి కేవలం 164 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా స్పష్టం చేసింది. ఈ విన్యాసాలను కొంతమంది యువకులు స్టేడియం పైకప్పు ఎక్కి వాటిని చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని కొంతమంది ఆస్వాదిస్తుండగా మరికొంతమంది మాత్రం ఇలాంటి విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తాయని మండిపడుతున్నారు.
దక్షిణాఫ్రికాలో క్రీడ సంబురాల సందర్భంగా విమానాలను తక్కువ ఎత్తులో ఫ్లైపాస్ట్ చేయిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. 1995 రగ్బీ ప్రపంచకప్ ఫైనల్స్ నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. నాడు సౌతాఫ్రికన్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 747 అత్యంత తక్కువ ఎత్తులో ఎగిరి అందర్నీ ఆశ్చర్యపరిచింది.









