
Jaguar Land Rover: ప్రముఖ కార్ల తయారీ సంస్థలు భారీగా ఉద్యోగుల కోతను విధిస్తుండగా అదే దారిలో టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు పయనించనుంది. ఇప్పటికే జర్మనీ కార్ల తయారీ సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ సుమారు లక్షమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తాజాగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో బ్రిటన్‌లో దాదాపు 4 వేల ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు ‘ది టైమ్స్’ కథనం వెలువరించింది. అమెరికా టారిఫ్‌లు, వాహన తయారీ ఖర్చులు పెరగడం, విక్రయాలు తగ్గడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
కాగా, ఉద్యోగాల కోతకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి ఆ సంస్థ సమాచారం అందజేసిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు కంపెనీ పేర్కొదని ఆ వార్తా కథనం వెల్లడించింది. సంస్థ ఆర్థికపరమైన అంశాలకు తగినట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయం వల్ల వేతన సిబ్బంది, మేనేజ్మెంట్ బృందాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా పేరున్న జేఎల్ఆర్ సంస్థ.. బ్రిటన్‌లో సుమారు 34 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
కాగా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే వ్యయం భారీగా ఉండటం, చైనా నుంచి ఎదురవుతున్న పోటీ తీవ్రత, అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిళ్లను తట్టుకొనేందుకే ఈ కంపెనీ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా. తీవ్ర పోటీ కారణంగా ఏడాది జూన్ చివరి నాటికి కంపెనీ ఆదాయం దాదాపు 10 శాతం వరకు తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు, జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కూడా లక్ష ఉద్యోగాలకు కోత విధిస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలో 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు. కాగా వీరిలో తొలిదశలో 50 వేలమంది, ఆ తర్వాత మరో 50 వేల మంది మొత్తంగా లక్షమందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.









