ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్కడ ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎవరికీ స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. దీనివల్ల దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎందుకంంటే ఏ ఒక్క పార్టీ కూడా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్క్ అయిన కనీసం 61 సీట్లు రావాలి.

కానీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) నాయకత్వంలోని ‘లికుడ్’ పార్టీకి కేవలం 53 సీట్లు మాత్రమే దక్కాయి. అలాగే ఆయనకు ప్రధాన ప్రత్యర్థి అయిన విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ నడిపిస్తున్న యాషర్ పార్టీకి 48 సీట్లు లభించాయి. ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు, అరబ్ పార్టీలకు ఏకంగా 19 సీట్లు వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ అరబ్ పార్టీల మద్దతు తీసుకోవడం తప్పనిసరి అయింది.

అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఇన్నాళ్లూ అరబ్ పార్టీలను యూదు వ్యతిరేకులుగా చూపిస్తూ వారిపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాన పార్టీలు, ఇప్పుడు అవే పార్టీల మద్దతు కోరడానికి వెనుకాడుతున్నాయి. ఒకవేళ వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని.. తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నాయకులు భయపడుతున్నారు. అయితే ప్రధాని నెతన్యాహుతో పోలిస్తే విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ మాత్రం కొన్ని నిబంధనలు, షరతులతో అరబ్ పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొంత ముందుకు వస్తున్నారు.

Also Read : మేడ్ ఇన్ యూఎస్ఏ ఫోన్ లోపల అసలు గుట్టు.. యూట్యూబర్ చేతిలో బట్టబయలైన ట్రంప్ ప్లాన్!

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ప్రధాని నెతన్యాహు తనదైన శైలిలో ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు. అరబ్ పార్టీల మద్దతు తీసుకునే రిస్క్ చేయకుండా నేరుగా తన ప్రధాన ప్రత్యర్థి అయిన విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ వైపు తన దృష్టి మళ్లించారు. శత్రువుతో చేతులు కలిపైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న నెతన్యాహు దీనికోసం ఒక రహస్య ప్లాన్-బీని రంగంలోకి దించారు. ప్రత్యర్థి పార్టీ నేతకే పదవుల గాలం వేసి తన వైపు తిప్పుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్లాన్-బీలో భాగంగా నెతన్యాహు వర్గం విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ ముందు రెండు సంచలన ఆఫర్లను ఉంచుతోంది. వాటిలో మొదటి ఆఫర్ ఏమిటంటే.. నెతన్యాహునే ప్రధాన మంత్రిగా కొనసాగుతారు. కానీ విపక్ష నేత ఐసెన్ కోట్‌కు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన మంత్రిత్వ శాఖలను అప్పగిస్తారు. ఇక రెండవ ఆఫర్ ఏంటంటే.. నెతన్యాహు, ఐసెన్ కోట్ ఇద్దరూ చెరో సగం కాలం ప్రధాని పదవిని సమానంగా పంచుకుంటారు.

అయితే నెతన్యాహు నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే లేదని విపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ ఇప్పటికే తేల్చిచెప్పేశారు. అయినప్పటికీ నెతన్యాహు వర్గం పట్టువదలక ఆయనను ఒప్పించడానికి రాయబారాలను పంపుతూనే ఉంది. ఈ వినూత్న రాజకీయం ఇజ్రాయెల్ దేశంలో ముందెన్నడూ లేనంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. చివరికి ఈ రాజకీయ డ్రామా ఎటు దారితీస్తుంది? నెతన్యాహు వేసిన ఈ సీక్రెట్ ప్లాన్ ఫలిస్తుందా? లేక విపక్ష నేత అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టిస్తారా? అనేది చూడాలి.

Also Read : ఇజ్రాయెల్ లో హంగ్.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 4 మార్గాలివే!