
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. 86 ఏళ్ల వయసున్న ఖమేనీ అంత్యక్రియలు నేడు అధికారికంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఆయన అంతిమయాత్ర బుధవారంతో ముగిసింది.
Also Read : స్పేస్‌లోకి హ్యుమన్స్.. బంగాళాఖాతంలో ల్యాండింగ్.. ఇస్రో గగన్‌యాన్ స్కెచ్‌తో ప్రపంచ దేశాలకు సవాల్
ఖమేనీ అంతిమయాత్ర గత శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమైంది. అక్కడ నుంచి ఇరాన్, ఇరాక్ దేశాల్లోని పలు ముఖ్యమైన నగరాల గుండా ఈ యాత్ర కొనసాగింది. మంగళవారం నాటికి ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాక్‌లోని నజఫ్ నగరానికి తీసుకువచ్చారు. తమ ప్రియతమ నాయకుడిని చివరిసారిగా చూసేందుకు లక్షలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కన్నీళ్లతో ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
నజఫ్ నగరంలో అంతిమ దర్శనం ముగిసిన తర్వాత బుధవారం ఖమేనీ మృతదేహాన్ని కర్బలా నగరానికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కర్బలా నగరాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అక్కడ కూడా లక్షలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర ముగిసింది. ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి తరలివచ్చిన ముస్లింలు ఈ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని ఖమేనీపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. నేడు ఖమేనీ అంత్యక్రియలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read : గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. భారీగా పెరగనున్న ధరలు?









