
India Helping Nepal : ప్రకృతి విపత్తు మూలంగా అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ అందించిన సాయంపై ఆ దేశ ప్రధాని బాలెన్ షా కృతజ్ఞతలు తెలిపారు. వరదలు సంభవించిన మొదటి రోజే భారత్ స్పందించి సహాయ సామగ్రిని పంపిందని ఆయన పార్లమెంటులో కొనియాడారు. మందులు, ఆహార పదార్థాలు, నీటిని శుద్ధి చేసే పరికరాలతో పాటు నిపుణులైన సహాయక బృందాన్ని భారత్ నేపాల్ పంపిందని వెల్లడించారు. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు పరిశీలకులను సైతం పంపిందని తెలిపారు. భారత సాంకేతిక బృందాలు మారుమూల ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. సంక్షోభ సమయంలో భారత్ నిజమైన మిత్రదేశంగా.. అండగా నిలిచిందని ప్రధాని ప్రశంసించారు.
Also Read : రాలీ డెల్ పరాగ్వేలో మెరిసిన భారత జోడీ నవీన్ పులిగిళ్ల, మూసా షరీఫ్
74T of assistance from India for Nepal till now, for friendship: it includes food packates, water purification tablets, medicines, HADR material, portable generators, dignity kits, blankets, sleeping bags etc; plus team of doctors, paramedics, forensics, tunnel rescue team. pic.twitter.com/BhSDXIrFWL
— Sankalan Chattopadhyay (@VinodDX9) September 2, 2026
కాగా విపత్తు అనంతరం భారత్ నేపాల్‌లో భారీ స్థాయిలో మానవతా, సాంకేతిక సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రెస్క్యూ బృందాలు, వైద్య నిపుణులు, డీఎన్ఏ ఆధారిత గుర్తింపు కోసం ఫోరెన్సిక్ నిపుణులను పంపించింది. నేపాల్, చైనా అధికారులతో సమన్వయం కోసం విదేశాంగ శాఖలో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
కష్ట సుఖాల్లో భారత్ ఎపుడూ అండగా ఉంది…ఆరోగ్య మంత్రి నిషా మెహతా
నేపాల్ సుఖదుఃఖాల్లో భారత్ తమకు ఎల్లప్పుడూ అండగా ఉందని నేపాల్ ఆరోగ్య మంత్రి నిషా మెహతా స్పష్టం చేశారు. భారీ వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి భారత్ మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించిందని ఆమె వెల్లడించారు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన బాధితుల మృతదేహాలను వెలికితీయడం, వారిని గుర్తించడం, డీఎన్ఏ(DNA) పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటులో భారత్ అందిస్తున్న సహాయాన్ని నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు.
🇳🇵🚨 Rescue Operations Intensify in Nepal | More Than 600 Workers Feared Trapped
More than 600 workers are feared trapped inside mud- and debris-filled tunnels at the Trishuli-3A Hydropower Site in Nepal. Rescue teams are racing against time, using heavy machinery, explosives… pic.twitter.com/96JSje8KyB
— Sahil chabra (@sahii199) September 1, 2026
భారత్, నేపాల్ దేశాల మధ్య సంబంధం ‘రోటీ-బేటీ’ వంటిదని ఆమె కొనియాడారు. ఇది కుటుంబ సదృశ్యమైన సోదరభావంతో కూడుకున్నదని నిషా మెహతా వెల్లడించారు. మంచి సమయాల్లోనే కాకుండా, కష్టకాలంలో కూడా భారత్ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. వరదల నుంచి సురక్షితంగా రక్షించిన ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఉంచామని, వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF) వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని ఆమె వివరించారు. కాగా, నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,127కు చేరుకున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు.
Also Read : పాక్ కన్నింగ్ బుద్ధి.. మోదీ ఫొటోను తొలగించి.. ఏం చేశారంటే?
Standing by Nepal, always.
India’s 10-tonne humanitarian assistance was handed over by Ambassador Naveen Srivastava to Minister of Culture, Tourism and Civil Aviation, Mr. Khadak Raj Paudel. The assistance would support relief efforts in the wake of the devastating floods.… pic.twitter.com/yUcDqcZWtE
— Randhir Jaiswal (@MEAIndia) August 26, 2026
#WATCH | Rasuwa, Nepal: Nisha Mehta, Health Minister, Nepal, says, “We have some holding centres where the rescued people have been kept. At the same time, we are taking good care of their health issues. Our neighbouring countries are also helping us. They have also come here for… pic.twitter.com/4MFROkkbRD
— ANI (@ANI) September 2, 2026









