
మిడిల్ ఈస్ట్ వార్‌లో రకరకాల ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి.సౌదీపై ఒకవైపు విరుచుకుపడుతున్న వేళ.. దాని మిత్రదేశమైన అమెరికాకు హౌతీలు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమెరికా నౌకలను టార్గెట్ చేయం. హౌతీలు ఇచ్చిన తాజా హామీ ఇది.అంటే..ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలు వెళ్తున్నా..వాటిపై తాము ఎలాంటి దాడులకు పాల్పడేది లేదని హౌతీలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా నౌకలను టార్గెట్ చేయబోమని హౌతీలు చెబుతున్నా..హౌతీలపై అమెరికా ఏం చేయబోతోంది అన్న ప్రశ్న ఇంకా అలాగే ఉంది.
ఎందుకంటే సౌదీ అరేబియాపై హౌతీల దాడులు పెరుగుతున్నాయి. యెమెన్‌లో కూడా హౌతీలు తమ పట్టు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది అమెరికాకు ఎంతమాత్రం మింగుడుపడని విషయం. వాషింగ్టన్ అంత ఈజీగా ఈ విషయాన్ని వదిలేయదు. అందుకే ఇప్పుడు అసలు చర్చ.. హౌతీలు అమెరికాతో ఎందుకు గొడవ వద్దనుకుంటున్నారు?.. అమెరికా ఇప్పుడు ఏం చేయబోతోంది?.. ఇదే ఇప్పుడు చూద్దాం.
ముందుగా హౌతీల తాజా ప్రకటన ఏంటో చూద్దాం. హౌతీల రాజకీయ విభాగానికి చెందిన మొహమ్మద్ అల్-బుఖైతి.. అమెరికా నౌకలను టార్గెట్ చేయబోమని హామీ ఇచ్చారు. అమెరికా నౌకలు ఎర్ర సముద్రంలో తిరిగినా.. వాటిపై ఎలాంటి దాడులు ఉండవని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హౌతీలు ఇలా చెప్పడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా అమెరికాతో నేరుగా తలపడేందుకు ఇష్టంలేక.. అమెరికా నౌకల విషయంలో ఒక అవగాహనకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హౌతీలు మళ్లీ అదే రూట్‌నే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇక్కడ హౌతీల కాలిక్యులేషన్ చాలా సింపుల్. సౌదీతో మాత్రమే మాకు గొడవ ఉంది. అమెరికాతో కయ్యానికి కాలుదువ్వడం ఎందుకు? అని!. ఎందుకంటే.. సౌదీతో పోరాడటం ఒక లెక్క. అమెరికా కూడా రంగంలోకి దిగితే అది మరో బిగ్వార్కు దారితీస్తుంది.
అమెరికా దగ్గర భారీ సైనిక శక్తి ఉంది. పెద్ద సంఖ్యలో విమానాలు ఉన్నాయి. మిసైళ్లు ఉన్నాయి. నౌకాదళం ఉంది. హౌతీలు ఎంత గట్టిగా పోరాడినా.. అమెరికాతో నేరుగా యుద్ధం చేయడం హౌతీలకు కత్తి మీద సామే. అందుకే.. అమెరికాకు హౌతీలు ఒక మెసేజ్ మాత్రమే ఇచ్చారు. “మీ నౌకల జోలికి మేం రాం.. మీరు కూడా మా వివాదంలో జోక్యం చేసుకోకండి అని !”. అయితే.. ఇక్కడ సౌదీ అరేబియానే ఈ స్టోరీలో అసలు సమస్య. సౌదీపై హౌతీలు దాడులు చేస్తున్నారు. డ్రోన్లు.. మిసైళ్లు.. ఇలా దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సౌదీ కూడా హౌతీల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. హౌతీల దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది. అంతేకాదు, సౌదీకి అగ్రరాజ్యం అమెరికా సపోర్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సౌదీకి ఇంటెలిజెన్స్.. టార్గెటింగ్ విషయంలో అమెరికా సాయం అందుతుందని వార్తలు వచ్చాయి.
అంటే.. అమెరికా నేరుగా హౌతీలపై దాడులు చేయకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌లో సౌదీకి సపోర్ట్ ఇస్తోంది. ఈ విషయం హౌతీలకు కూడా తెలుసు. అందుకే, అమెరికాతో హౌతీలు గొడవ వద్దనుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఇంకో విషయం గమనించాలి. హౌతీలు యెమెన్‌లో దాడులు చేయడం మాత్రమే కాదు.. అక్కడి ముఖ్యమైన ప్రాంతాలను మరింత ఆధీనంలోకి తీసుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో హౌతీల పట్టు పెరుగుతోంది. ఇక్కడే బాబ్ ఎల్ మండేబ్ అనే ఒక చిన్న జలసంధి ఉంది. ఈ జలసంధి చిన్నదే.. కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఎర్ర సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్‌కు వెళ్లే ప్రధాన మార్గం ఇదే. ఈ రూట్లోనే ప్రపంచంలోని చాలా వాణిజ్య నౌకలు వెళ్తుంటాయి.
అంటే.. ఎర్ర సముద్రం పూర్తిగా హౌతీల కంట్రోల్లో ఉంటే.. వాళ్లకు ప్రపంచాన్ని శాసించే ఆయుధం దొరికినట్టే. ఇదే అమెరికాకు టెన్షన్ తెచ్చిపెడుతోంది. ఇప్పుడు హౌతీలు ఏం చెబుతున్నారు?.. “అమెరికా నౌకలను టార్గెట్ చేయం.” అంటే.. అమెరికా నౌకలు సేఫ్‌గా వెళ్లొచ్చని చెప్తున్నారు. కానీ.. సౌదీకి మాత్రం అలా కుదరదు అంటున్నారు. సౌదీతో తమ యుద్ధం కొనసాగుతుందని క్లియర్‌గా మెసేజ్ ఇస్తున్నారు. అంటే.. అమెరికా నౌకలకు రూట్ క్లియర్ అంటూనే.. సౌదీకి వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. సౌదీపై దాడులు పెరుగుతుంటే.. మిత్రదేశంగా అమెరికా ఎంతకాలం సైలెంట్‌గా ఉంటుంది?.. ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే.. ఇక్కడ ఒక విషయంపై క్లారిటీ అవసరం. అమెరికా వెంటనే హౌతీలపై దాడులకు సిద్ధమైందని ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.
Also Read : ట్రంప్ కొత్త చట్టం.. భారత్‌పై 100% టారిఫ్..?
ఇప్పటిదాకా వచ్చిన రిపోర్టుల ప్రకారం.. హౌతీలపై ఎలాంటి దాడులు చేసే ఉద్దేశం లేదని అమెరికా అధికారులు చెప్పారు. అంటే.. అమెరికా ఇప్పటికిప్పుడు హౌతీలపై యుద్ధానికి దిగబోతుందని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అలా అని.. అమెరికా చేతులు కట్టుకుని కూర్చుంది అని చెప్పడానికి వీల్లేదు. సౌదీతో మాట్లాడుతోంది. సౌదీకి ఇంటెలిజెన్స్ ఇస్తోంది. సైనిక పరిస్థితిని గమనిస్తోంది. హౌతీల మూవ్‌మెంట్‌ను పెంటగాన్ క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తోంది. అంటే.. తన ఆప్షన్స్‌ను అమెరికా ఓపెన్‌గా పెట్టుకుంది. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోతే.. అమెరికా కూడా తన స్టాండ్ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు.. హౌతీలు అమెరికా నౌక మీదే దాడి చేస్తే ఏమవుతుంది?.. బాబ్ ఎల్ మండేబ్‌లో నౌకల రాకపోకలను హౌతీలు పూర్తిగా అడ్డుకుంటే ఏమవుతుంది?.. అప్పుడు కూడా అమెరికా చూస్తూ కూర్చుంటుందా?.. అదే ఇప్పడు అందరి డౌట్. ఎందుకంటే.. అమెరికాకు సముద్ర మార్గాల భద్రత చాలా ఇంపార్టెంట్.. ముఖ్యంగా రెడ్ సీ.
ఇది కేవలం యెమెన్ సమస్య కాదు. నిజంగా రెడ్ సీలో ఏదైనా టెన్షన్ నెలకొంటే.. అది నేరుగా వరల్డ్ ఎకానమీపై ఎఫెక్ట్ పడొచ్చు. ఆయిల్ సప్లై మీద ఎఫెక్ట్ పడొచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ పెరగొచ్చు. నౌకలు మరో మార్గంగుండా వెళ్లొచ్చు. అందుకే.. హౌతీలు ఎర్ర సముద్రంలో ఏం చేస్తున్నారు అన్నది అమెరికాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం. అమెరికా, హౌతీల మధ్య ఇప్పటికే టాక్స్ జరిగాయని వార్తలు వచ్చాయి. ఒమాన్ మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలు మాట్లాడుకున్నట్టు రిపోర్ట్స్ గుప్పుమన్నాయి. అంటే.. బయటకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా.. వెనక మాత్రం ఇద్దరి మధ్య మాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఎందుకు అనే డౌట్ అందరిలో రావొచ్చు. అయితే, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. యుద్ధం మరింత ముదరకుండా ఉండేలా.. అటు హౌతీలు, ఇటు అమెరికా జాగ్రత్త పడుతున్నట్టుగా భావించొచ్చు.
ఎందుకంటే.. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిడిల్ ఈస్ట్‌లో అమెరికా బిగ్‌వార్ కోరుకోవడం లేదు. అలాగే అత్యంత శక్తివంతమైన అమెరికాతో హౌతీలు నేరుగా తలపడాలని అనుకోవడం లేదు. అందుకే.. ఇద్దరూ తమ తమ హద్దుల్లో ఉంటున్నట్టు మాత్రమే చూడాలి. ఇప్పుడు సౌదీ విషయానికి వద్దాం. సౌదీ ప్రస్తుతం డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే.. హౌతీలు రోజురోజుకీ సౌదీపై దాడులు పెంచుతున్నారు. మిసైళ్లు, డ్రోన్ల అటాక్స్‌తో రాజధాని రియాద్ అట్టుడుకుతోంది. మరోవైపు సౌదీ డిఫెన్స్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ.. దాడులు ఎక్కడా పూర్తిగా ఆగడం లేదు. సరిగ్గా ఇక్కడే అమెరికా నుంచి సౌదీ మరింత సపోర్ట్ కోరే అవకాశం ఉంది. సౌదీకి అమెరికా మరింత సైనిక సాయం చేస్తే.. హౌతీల రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. హౌతీలు క్లారిటీగా ఉన్నారు. అమెరికా నౌకలను తాము టార్గెట్ చేయబోమని అనౌన్స్ చేశారు. అంటే.. అమెరికాతో లైన్ దాటకూడదన్న ఆలోచన హౌతీలకు ఉందని ఇట్టే అర్థమవుతుంది.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. సౌదీకి ఎంతవరకు అమెరికా సపోర్ట్ చేస్తుంది అని!. అసలు గేమ్ అంతా ఈ పాయింట్లోనే ఉంది. సౌదీకి అమెరికా ఆయుధాలు ఇస్తే.. ఇంటెలిజెన్స్ ఇస్తే.. హౌతీలపై టార్గెటింగ్ విషయంలో సాయం చేస్తే.. హౌతీల రియాక్షన్ ఎలా ఉండబోతుంది?. అమెరికా నౌకలపై దాడిచేయం అన్న మాటపై హౌతీలు ఉంటారా?. ఇది ఇప్పుడే చెప్పడం కష్టం. అందుకే.. హౌతీల ప్రామిస్‌ను చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది ఏదైనా హౌతీలకు- అమెరికాకు జరిగిన శాంతి ఒప్పందమా? కానే కాదు. అమెరికా–హౌతీల మధ్య యుద్ధం పూర్తిగా ముగిసిందా? అలా కూడా చెప్పలేం. హౌతీలు కేవలం ఒక విషయం క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అమెరికా నౌకలను టార్గెట్ చేయం. అదే సమయంలో.. సౌదీపై మాత్రం పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు.
అంటే.. ఇది ఒక రకంగా అమెరికాకు ఇచ్చిన వార్నింగ్ కూడా చూడాలి అంటున్నారు అనలిస్టులు. “మా జోలికి రావద్దు.. మేం మీ జోలికి రాం.” కానీ.. సౌదీకి అమెరికా ఎంతలా సపోర్ట్ చేస్తుంది అనేదే అసలు విషయం. ఈ స్టోరీలో మరో దేశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అదే.. ఇరాన్. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికాతోపాటు ప్రపంచం మొత్తం కోడైకూస్తోంది. అయితే ఇరాన్ మాత్రం, హౌతీలు తమ కంట్రోల్ ఉన్నారన్న వాదనను అంగీకరించదు. కాబట్టి.. హౌతీలపై అమెరికా భారీ దాడి చేస్తే.. అది కేవలం అమెరికా–హౌతీల గొడవగా చూడలేం. ఆ రెండు వర్గాల గొడవ.. మిడిల్ఈస్ట్లో ఉన్న టెన్షన్‌ను మరింత పెంచే అవకాశం ఉంటుంది. అందుకే.. అమెరికా కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు మొత్తం సీన్‌ను ఒకసారి సింపుల్‌గా చూద్దాం. హౌతీలు ఏం అంటున్నారు? అమెరికా నౌకలను టార్గెట్ చేయం. సౌదీ ఏం చేస్తోంది? హౌతీల దాడులను అడ్డుకుంటోంది. అమెరికా ఏం చేస్తోంది? సౌదీకి సపోర్ట్ ఇస్తోంది. కానీ,ఇప్పటివరకు నేరుగా హౌతీలపై యుద్ధానికి దిగలేదు.
అయితే, ఇకముందు ఏం జరగబోతుందనేదే అసలు ప్రశ్న. అమెరికా నౌకల విషయంలో హౌతీలు ఇచ్చిన మాట మీద ఉంటారా? సౌదీపై దాడులు ఇంకా పెరుగుతాయా? సౌదీకి అమెరికా మరింత సపోర్ట్ ఇస్తుందా? లేదా, నేరుగా హౌతీలపై దాడులకు అమెరికా సిద్ధపడుతుందా?. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానాలు దొరకని ప్రశ్నలు. ఎందుకంటే.. ఎర్ర సముద్రం అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. ఒక్క మిసైల్.. ఒక్క నౌక.. ఒక్క దాడి.. మొత్తం లెక్కనే మార్చేయొచ్చు. ఇదే ఇప్పుడు ఎర్ర సముద్రంలో అసలు ఉత్కంఠ.
Also Read : ఇక ఇరాన్ విమానాలు ఎగరవు… గ్లోబల్ షట్‌డౌన్ ప్రకటించిన అమెరికా









