
India : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో బుధవారం తీవ్ర కలకలం జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో కో-పైలట్ మరో పైలట్‌పై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన పైలట్ పేరు కెప్టెన్ స్మిత్ మచ్చర్. ఆయన భారతీయుడు. కో-పైలట్ విమానం నియంత్రణను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అతన్ని అడ్డుకునేందుకు కెప్టెన్ మచ్చర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో కో-పైలట్ ఆయనపై కత్తితో దాడి చేశాడు.
దాడిలో కెప్టెన్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముఖం, చేతులపై రక్తం వచ్చింది. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విమాన సిబ్బందిలో ఒకరు, ఒక ప్రయాణికుడు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ గొడవ కారణంగా విమానం కొద్దిసేపట్లోనే 17,400 అడుగుల ఎత్తు వరకు కిందికి పడిపోయింది. పరిస్థితిని గమనించిన మరో ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : గుర్తు పెట్టుకోండి : ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే పేరు ఇది… ట్రంప్ నుంచి మోదీ వరకు భారత పైలట్ కు సలామ్!
విమానం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్లాల్సి ఉండగా, దాన్ని సౌదీ అరేబియాకు మళ్లించారు. అక్కడి విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగింది. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని భారత అధికారులు కూడా తెలుసుకుంటున్నారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు విమానాలు నడపడంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన బోయింగ్ 737 విమానాల్లో ఎక్కువగా పనిచేశారు. ఇప్పటివరకు 9,750 గంటలకు పైగా విమానాలు నడిపినట్లు సమాచారం.
2011లో స్మిత్ మచ్చర్ స్పైస్‌జెట్‌లో చేరారు. అక్కడ దాదాపు 11 ఏళ్లు పనిచేశారు. పైలట్‌గా మాత్రమే కాకుండా, ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతలు కూడా నిర్వహించారు. 2022లో స్పైస్‌జెట్‌ను వదిలి ఫ్లై దుబాయ్‌లో కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు తెలుస్తోంది. విమానం సురక్షితంగా దిగిన తర్వాత కొంతమంది ప్రయాణికులు కెప్టెన్ మచ్చర్‌ను అభినందించారు. మీరు విమానాన్ని కాపాడారు. మీరు చాలా బాగా చేశారు అంటూ ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కెప్టెన్ మచ్చర్‌ను ప్రశంసించారు. ఆయనను నిజమైన హీరోగా అభివర్ణిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
Also Read : 174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?









