
Indonesia : ఇండోనేషియాలోని బాలి సమీపంలో ఫెర్రీలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ ఫెర్రీలో సుమారు 131మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కోస్టల్ సిబ్బంది. ఇప్పటివరకు 106 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సిబ్బంది శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. కోస్టల్ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Also Read : రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు… మహిళ వ్యాపారవేత్త సామ్రాజ్యం ధ్వంసం
Un ferry de pasajeros se incendió en aguas frente a la isla de Lombok, Indonesia, con unas 130 personas a bordo, según informaron las autoridades locales. pic.twitter.com/MMQgYxd7EH
— aapayés (@aapayes) August 12, 2026
అయితే ఫెర్రీ నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసి పడుతుండంటంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫెర్రీ నుంచి నీళ్లలో దూకిన వారిని రక్షించడానికి హెలికాఫ్టర్‌ను రంగంలోకి దించారు. కాగా, ఫెర్రీలో ప్రయాణీకులతో పాటు 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం దాటికి అవన్నీ కాలి బూడిదయ్యాయని వారు వెల్లడించారు. కాగా ఈ ఫెర్రీ బాలిలోని పడాంగ్ బాయి పోర్టు నుంచి లెంబార్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Also Read : సీక్రెట్ సర్వీస్ చెప్పినట్లే వింటా: విమానం మార్పుపై ట్రంప్ స్పష్టత









