భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిక్కిం సెక్టార్‌లోని భారత గగనతలంలోకి చైనాకు చెందిన ఒక మిలిటరీ విమానం అక్రమంగా ప్రవేశించింది. అంతటితో ఆగకుండా మన దేశం నుంచి వస్తున్న హెచ్చరికలను ఏకంగా 25 నిమిషాల పాటు పక్కన పెట్టి.. గగన తలంలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

సిక్కిం సరిహద్దు ప్రాంతంలో చైనా యుద్ధ విమానం మిలిటరీ డ్రోన్ భారత రేఖను అతిక్రమించింది. సాధారణంగా సరిహద్దుల వద్ద రెండు దేశాల సైన్యాలు, రాడార్లు అత్యంత అప్రమత్తంగా ఉంటాయి. అలాంటి చోట చైనా విమానం మన గగనతలంలోకి చొచ్చుకురావడమే కాకుండా.. దాదాపు 25 నిమిషాల పాటు ఎవరి హెచ్చరికలను లెక్క చేయకుండా తిరగడం దేశ రక్షణ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఒక దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా శత్రు దేశ విమానాలు వ్యవహరించాయి.

Also Read : బ్రిటన్‌కు పొంచి ఉన్న భారీ విపత్తు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హై అలర్ట్!

సిక్కిం ప్రాంతం భారత్‌కు కీలకమైన, సున్నితమైన ప్రాంతం. గతంలో ప్రపంచ దేశాలను కలవరపెట్టిన డోక్లామ్ ప్రతిష్టంభన జరిగిన ప్రాంతం ఇక్కడికి అతి సమీపంలోనే ఉంది. భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులు కలిసే ఈ త్రి సంధి ప్రాంతంపై చైనా ఎప్పటి నుంచో కన్నేసి ఉంది. అలాంటి ప్రాంతంలో చైనా మిలిటరీ విమానాలు ప్రవేశించి ఏకంగా 25 నిమిషాల పాటు హల్‌చల్ చేయడం అంటే.. మన రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని, రాడార్ల స్పందన వేగాన్ని పరీక్షించడమేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలో కూడా తూర్పు లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద చైనా ఫైటర్ జెట్లు ఇలాగే సరిహద్దుకు దగ్గరగా రావడానికి ప్రయత్నించాయి. అయితే మన దేశ రక్షణ వలయం ఎంత పటిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన రాడార్లు క్షణాల వ్యవధిలో ఈ కదలికలను పసిగట్టాయి. భారత వైమానిక దళం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. శత్రు విమానాలు మన గగన తలంలోకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు మన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షణాల్లో సిద్ధమయ్యాయి.

Also Read : పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్!