Crime News : అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన శాలిని ఠాకూర్ అనే 38 ఏళ్ల మహిళను భారతీయ యువకుడు దారుణంగా హత్య చేశాడు. శాక్రమెంటోలోని ఓ రెస్టారెంట్ బయట రోహిత్(22) అనే యువకుడు శాలినిని వెంబడించి కాల్చి చంపడం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రద్దీగా ఉండే హైవేపై పోలీసులు పట్టుకునే క్రమంలో అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రోహిత్‌ దాదాపు ఏడాది కాలంగా శాలిని వెంటాడి వేధించి.. పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కారణంతో ఆమెను చంపినట్లు తెలుస్తోంది.

స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితున్ని గతంలో అక్రమ వలసదారుడిగా పోలీసులు గుర్తించి నిర్భందించారు. అరిజోనాలో నిర్బంధానికి గురయ్యాడు. అనంతరం అతన్ని అమెరికా అధికారులు భారత్ కు పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, షాలినీకి రోహిత్ తో ఆమె పనిచేసే డోర్ డాష్ పికప్స్ దగ్గర పరిచయం అయినట్లు ఆమె తల్లి తెలిపారు. ఆనాటి నుంచి రోహిత్ తన కూతురిని వేధిస్తున్నట్లు షాలినీ తల్లి సుదేశ్ కుమారి వెల్లడించారు. తన కూతురిని పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడని. అయితే రోహిత్‌ వయసు శాలని కంటే తక్కువగా ఉండటంతో తన కూతురు రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. దీంతో అతను ఉన్మాదిగా మారాడని ఆరోపించింది. షాలినీ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడని.. ఆ తర్వాత రోహిత్ పరిచయం పెంచుకుని.. కాల్ మీ, నీ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని.. మెస్సేజ్ లు పంపేవాడని తల్లి తెలిపింది. అతని వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. 2025 నుంచి వేదింపులకు పాల్పడుతూ.. ఈ మధ్య మరీ విపరీతంగా వెంటపడుతున్నట్లు తల్లి పేర్కొన్నారు. ఇంటి ముందు గంటల తరబడి నిలబడటం, ఫాలో కావడం చేస్తున్నాడని ఆమె తెలిపింది.. ఆపిల్ ఎయిర్ ట్యాగ్ కార్ కు అతికించి శాలినినీ ట్రాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటనకు ముందు షాలినీతో రోహిత్ దాదాపు గంటసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తను ఫోన్ చేస్తే.. 15 నిమిషాల్లో కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్‌ చేసిందని తెలుస్తోంది. శాక్రమెంటో ప్రాంతంలో శాలిని ఉద్యోగం చేస్తుండగా, రోజు మాదిరిగానే విధుల నిమిత్తం వెళ్తున్న ఆమెను రెస్టారెంట్ వద్ద రోహిత్ అడ్డగించాడని పోలీసులు తెలిపారు. కాసేపు శాలినితో రోహిత్ వాగ్వాదం పెట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. అతడి నుంచి తప్పించుకుని పారిపోతున్న శాలినిపై రోహిత్ పలుమార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఆమె కిందపడిన తర్వాత కూడా వదల కుండా దగ్గరగా వచ్చి తలపై మరోసారి కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో శాలిని అక్కడికక్కడే మరణించినట్లు దృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని వెంబడించారు. ఈ క్రమంలోనే అక్కడే ఓ ఆగి ఉన్న కారులో రోహిత్ శవమై కనిపించాడు. దీంతో తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.