
Tollywood Director : భారతీయ చిత్రసీమలో చాలా కాలంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సర్వసాధారణం అయ్యాయి. సీనియర్ నటీమణులతో పాటు నేడు కొత్తగా ఇండస్ర్టీకి వస్తున్న హీరోయిన్లు కూడా పలువురు నిర్మాతలు ,దర్శకులు, హీరోల మీద కంప్లైట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం కొనసాగుతోంది. కానీ గతంలో నటీనటులు చేసిన శారీరక కార్యకలాపాలు వారిని వెంటాడటంతో, అప్పుడప్పుడు పలువురు నటీనటులకు సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక నటి చేసిన ఆరోపణల కారణంగా హైదరాబాద్ పోలీసులు ఒక తెలుగు చిత్ర దర్శకుడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
Also Read : మంత్రి వర్గం నుంచి సురేఖ ఔట్?… వరంగల్ తూర్పులో హై టెన్షన్..
ఈ యువ దర్శకుడు ప్రస్తుతం ఒక మలయాళ నటుడితో సినిమా తీస్తున్నాడని, అతని గత రికార్డు అంతంతమాత్రంగానే ఉందని తెలుస్తోంది. ఈ నటి గతంలో కూడా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.ఆ నటి తన వాదనను నిరూపించడానికి తగిన ఆధారాలతో హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా, ఈ దర్శకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని ఆ నటి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఆ యువ డైరెక్టర్ రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడని, అందులో కొన్ని మంచి విజయాన్ని అందుకున్నా.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. ఇండస్ట్రీలో అతను తెలియని వాడైతే కాదని. ప్రస్తుతం అతను ఒక మలయాళ హీరోతో పెద్ద ప్రాజెక్టు కూడా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.
తను తీస్తున్న పెద్ద ప్రాజెక్ట్‌కు సంబంధించిన సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ అరోపణలు రావడం గమనార్హం. ఆ యువ డైరెక్టర్.. ఒక హీరోయిన్ ని ప్రేమ పేరుతో మోసం చేశాడని. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని టాక్ నడుస్తోంది. అవన్నీ నమ్మి ఆ హీరోయిన్ పూర్తిగా మోసం పోయిందట. దీంతో ఆ హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. ఆ డైరెక్టర్ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేయడం.. రిమాండ్ కి పంపడం కూడా జరిగాయని టాలీవుడ్‌లో వార్తలు గుప్పు మంటున్నాయి. ఆ తెలుగు డైరెక్టర్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అలాగే ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : హైదరాబాద్ విమానాశ్రయంలో యూడీఎఫ్.. వెళ్లేవారికి తగ్గింపు… దిగే వారికి పెంపు









