UPPAL BALU HOT COMMENTS : బిగ్ బాస్‌‌పై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన బిగ్ బాస్ అగ్నిపరీక్ష-2కు హాజరైన ఉప్పల్ బాలు బిగ్ బాస్ ఆడిషన్స్‌లో అవమానం జరిగిందంటూ ఆరోపించాడు. సోషల్‌ మీడియా వేదికగా ఉప్పల్‌ బాలు బిగ్‌బాస్‌, ఆడిషన్స్‌తో పాటు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నవదీప్‌, బిందుమాధవిపై సంచలన ఆరోపణలు చేశాడు. డ్రగ్స్‌ తీసుకునేవారు జడ్జీలుగా ఉండే అర్హత లేదంటూ దుయ్యబట్టాడు. ఆడిషన్స్‌లోనే అవమానించి రిజెక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బిగ్‌ బాస్‌ అగ్ని పరీక్షకు జడ్జీలుగా ఉన్న నటుడు నవదీప్, నటి బిందు మాధవిపై కేసు నమోదు చేస్తానని బాలు తీవ్రంగా మండిపడ్డారు.నవదీప్ నన్ను తీవ్రంగా అవమానించారంటూ ఉప్పల్‌ బాలు ఫైర్‌ అయ్యారు. నా ఫ్యాన్స్ అందరనీ పిచ్చి ఫ్యాన్స్ అన్నాడు. బిగ్‌బాస్‌కి వెళ్లి సమాజానికి ఏ మెస్సేజ్ ఇస్తావని ఎగతాళి చేశాడని ఉప్పల్‌ బాలు ఆవేదన వ్యక్తం చేశాడు.

నవదీప్ ఎన్నిసార్లు డ్రగ్స్ వ్యవహారంలో దొరకలేదు.? డ్రగ్స్ తీసుకుని, పోలీస్ స్టేషన్‌ల చుట్టు తిరగలేదా.? అంటూ ఉప్పల్‌ బాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.నవదీప్‌కు జడ్జ్‌గా ఉండే అర్హత లేదన్న బాలు,నన్ను కావాలనే నవదీప్, బిందు మాధవి రిజెక్ట్ చేశారని ఆరోపించారు. బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో — అందరికీ టాస్కులు ఇచ్చిన జడ్జీలు నాకేందుకు ఇవ్వలేదని బాలు ప్రశ్నించారు. కేవలం నన్ను నా ఫేమ్ కోసం వాడుకున్నారు.రేటింగ్ కోసం అవసరానికి పిలిపించుకుని తిరిగి పంపించారు.నవదీప్‌ను మాత్రం వదిలే ప్రసక్తే లేదంటూ ఉప్పల్‌ బాలు హెచ్చరించాడు.

అవమానంతో తను చనిపోతే తన చావుకు నవదీప్ కారణం అంటూ ఉప్పల్ బాలు కంటతడి పెట్టాడు. కాగా, ఉప్పల్‌ బాలు పెట్టిన పోస్ట్‌కు నెటిజన్లు పూర్తి స్థాయిలో మద్ధతు పలుకుతున్నారు.మరోవైపు సోషల్ మీడియాలో ఉప్పల్ బాలుకు మద్దతు పెరుగుతుంది,ఇప్పటివరకు బిగ్ బాస్‌కు వెళ్లిన వాళ్లు..బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన వాళ్లు సమాజానికి ఏం ఉపాయోగపడ్డారని నెటిజన్ల కౌంటర్ ఇస్తున్నారు. కాగా, ఉప్పల్‌ బాలు ఆరోపణలపై నిర్వహకులు ఏం సమాధానం చెప్తారో చూడాలి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.