cm revanth reddy

CM Revanth Reddy : తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడానికి రాజకీయ కోణమే కారణమని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని అన్నారు. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో నే అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు వివరించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో రేవంత్‌ పోస్ట్‌ చేశారు. ఈ అంశంపై లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఆదివారం స్పందించారు. యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తాను హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాట్లాడతానని స్పష్టం చేశారు. తన పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అనుమతి లేకపోవడంతో.. బోస్టన్ వెళ్లకుండానే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతున్నట్లు వివరించారు.

Also Read : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ.. క్రమశిక్షణ కమిటీకి మరో సంచలన లేఖ

మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు చేరుకుంటానని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. అక్కడికి వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతా. లండన్‌ పర్యటనలో అన్ని సమావేశాలు, కార్యక్రమాలు పూర్తి చేశానని తెలిపారు. తన అమెరికా పర్యటనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలతోపాటు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. గత మూడు రోజులుగా తన పర్యాటనకు మద్ధతు తెలిపిన పార్టీ నేతలు, ప్రజలకు, మద్ధతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా, 10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి గత బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందూ. లండన్‌ పర్యటన ముగించుకుని.. అనంతరం యూఎస్‌లో ఆయన పర్యటించాల్సి ఉండింది. కానీ సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడం గమనార్హం. ఆయన పర్యటనను ఎందుకు నిరాకరించామో కూడా విదేశాంగ శాఖ వివరించింది. అయితే సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ యూఎస్ పర్యటనను కేంద్రం కావాలనే అడ్డుకుందంటూ ఆయన ఆరోపించారు. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్ సీఎంకు యుఎస్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ సీఎంకు నిరాకరించడం.. ద్వంద్వ వైఖరికి నిదర్శమని వారు ఆరోపించారు.

Also Read : బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ అక్రమ దందా.. నలుగురు అరెస్ట్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.