
Woman Biryani : చెన్నైలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ వండిన ఘటన కలకలం రేపింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో లభించిన ఓ సూట్ కేసులో మహిళ శరీర భాగాలు బయటపడిన విషయం వెలుగు చూసింది. కాగా, ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రైలులో దుర్వాసన వస్తున్న విషయాన్ని ప్రయాణికులు పోలీసులకు తెలపగా వారు ఆగ్రా రైల్వే స్టేషన్లో ఓ సూట్‌కేసు నుంచి వాసన వస్తున్నట్లు గుర్తించారు. దాన్ని తెరవగా అందులో మహిళ శరీర భాగాలు లభించాయి. దీన్ని ద్వారా పోలీసుల కూఫీలాగగా శరీర భాగాల మూలాలు చెన్నైలో దొరికాయి. దీనికోసం పోలీసులు 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు.
Also Read : గణేశ్ ఉత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి!
ఈ సందర్భంగా ఒక రెడ్ కలర్ సూట్‌కేస్‌తో వచ్చిన ఓ పురుషుడు, మహిళ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో దాన్ని బోగీలో వదిలేచి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులిద్దరూ లోకల్ ట్రైన్లో గూడువాంజేరి చేరుకున్నట్లు గుర్తించారు. . అదే వ్యక్తులు సూట్‌కేస్‌తో ఓ ఆటోలో వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు గుర్తించాయి. ఆటోను అనుసరిస్తూ వెళ్లిన పోలీసులు గూడువాంజేరి మసీదు వీధిలో వారు నివసిస్తున్న ఇంటిని పోలీసులు గుర్తించారు. ఆ ఇంటిలో ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్.. అతని భార్య భాగమతి మాజిక్ కలసి ఉంటున్నారని గుర్తించారు. వారితో పాటు హయాత్ నిషా అనే మహిళా కూడా ఉంటుందని స్థానికులు తెలిపారు. దీంతో హత్యకు గురైంది నిషాగా పోలీసులు అనుమానిస్తు్న్నారు. అక్కడకు వెళ్లి చూసిన పోలీసులకు భయానక దృశ్యాలు కనిపించాయి. మహిళ శరీరాన్ని ముక్కలుగా కోయడమే కాకుండా.. ఆనవాళ్లు లేకుండా చేయడం కోసం ఆ ముక్కలతో బిర్యానీ వండినట్లుగా గుర్తించి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కాగాపోలీసుల దర్యాప్తులో మృతురాలు హయాత్ నిషా ఒడిశాకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె భర్త నుంచి విడిపోయి చెన్నైలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె తన19 ఏళ్ల కుమారుడు తాంబరం ప్రాంతంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిషాతో కలిసి ఉంటున్న మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ నిషాకు బంధువులని చెప్పుకున్నట్లు పోలీసులకు తెలిసింది. నిషాను లస్కర్ దంపతులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. డబ్బు, నగలు కోసం హత్య చేశారా? లేక మృతురాలికి, అనుమానితులకు మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే కారణమా? అనేది తేలాల్సి ఉంది. ఈ సందర్భంగా మృతురాలి కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.? కాగా మహిళాను హత్య చేసి ఆ మాంసంతో బిర్యానీ వండిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. నెలకు రూ.72 వేల జీతం.. 8వ పే కమిషన్ సంచలన నిర్ణయం









