Sharanya : ఫోక్‌ డాన్సర్‌ ఈశ్వర్‌సాయి, మాధురి రాథోడ్‌ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలో ఈశ్వర్‌సాయి భార్య సాయిశరణ్య బలవన్మరణానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.దీంతో ఆమెఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి సాయి శరణ్య ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఈ ఆడియోలో సంచలన విషయాలు వెల్లడించారు.నా భర్త కోసం చేస్తున్న పోరాటంలో ఓడిపోయా..ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మొన్న వస్తానని చెప్పిన ఈశ్వర్ ఇప్పటికీ రాలేదు. మాధురి బ్రదర్స్ చంపేస్తారని అన్నాడు. ఉన్నాడో, చనిపోయాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read : చేయూత పింఛన్ దరఖాస్తుదారులకు గుడ్‌ న్యూస్‌.. గడువు మరోరోజు పొడిగింపు

నేను తీసుకుంటున్న డెసిషన్ చాలా పెద్దది.నేను పోతే నా బిడ్డకు ఎవరూ ఉండరు.నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది.నా భర్తకు బెయిల్ రావాలని చాలా మంది సపోర్ట్ చేశారు.ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను. ఈ పోరాటంలో మోసపోయా. నా జీవితం ఆగమైపోయింది. ఈ ద్రోహాన్ని నేను తట్టుకోలేను. సాయి మన ఏడేళ్ల కాపురం ఇలా ఎందుకైంది.నువ్వు, మాధురి కలిసి కావాలనే ఇలా చేశారా అంటూ శరణ్య ప్రశ్నించారు.నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం..నా జీవితం ఆగం చేశారు.. ఇది చేయడం తప్పంటూ మాధురి పేరెంట్స్‌కు శరణ్య రిక్వెస్ట్ చేసింది. అమ్మా, నాన్న నాకు చాలా ఎక్కువే చేశారు.నాన్న సాయిని నువ్వు ఎక్కువగా నమ్మావ్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఆడియో సంచలనంగా మారాయి. కాగా శరణ్య ఆత్మహత్యాయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఎలా ఉన్నారు అనే సమాచారం మాత్రం తెలియరాలేదు.

ఇటీవల తెలంగాణ జానపద రంగానికి చెందిన ఈశ్వర్ సాయి, డ్యాన్సర్ మాధురి రాథోడ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వేములవాడలోని ఒక హోటల్‌ గదిలో తన భర్త ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లను శరణ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్, తీవ్ర మనస్తాపం కారణంగా శరణ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.అంతకుముందు, ఇదే వివాదంలో న్యాయం జరగడం లేదని తనను పెళ్లి పేరుతో ఈశ్వర్ సాయి మోసం చేశాడంటూ జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్ కూడా హైదరాబాద్ పుప్పాలగూడలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆమె కుటుంబ సభ్యులు గమనించి కాపాడారు.

Also Read : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 110 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.