
TIMS : హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో నూతనంగా నిర్మించిన ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (TIMS) ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆసుపత్రిలో మౌలిక వసతులను కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వైద్య సేవలను ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది భర్తీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. టిమ్స్ ఆసుపత్రి పరిపాలనను అత్యున్నత ప్రమాణాలతో నడిపించేందుకు అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ స్టాఫ్ భర్తీ బాధ్యతలను నిమ్స్ (NIMS) హాస్పిటల్‍కు అప్పగించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి గాను టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాలలో మొత్తం 122 పోస్టుల భర్తీకి నిమ్స్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు ప్రధాన విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
1. టెక్నీషియన్ పోస్టులు (మొత్తం ఖాళీలు: 98)
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 34 పోస్టులు
అనస్థీషియా టెక్నీషియన్: 20 పోస్టులు
ఎక్స్-రే / సి-ఆర్మ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 10 పోస్టులు
ఈసీజీ టెక్నీషియన్: 06 పోస్టులు
క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 06 పోస్టులు
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్-II: 04 పోస్టులు
సీటీ టెక్నీషియన్ గ్రేడ్-II: 04 పోస్టులు
ఎమ్‌ఆర్‌ఐ టెక్నీషియన్: 04 పోస్టులు
సీఎస్‌ఎస్‌డీ (CSSD) టెక్నీషియన్: 04 పోస్టులు
ఈఈజీ టెక్నీషియన్ గ్రేడ్-II: 02 పోస్టులు
బయోమెడికల్ టెక్నీషియన్: 02 పోస్టులు
ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01 పోస్టు
ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు
2. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు (మొత్తం ఖాళీలు: 24)
సీనియర్ అసిస్టెంట్: 05 పోస్టులు
సూపర్‌వైజర్: 04 పోస్టులు
హెల్త్ ఇన్‌స్పెక్టర్: 04 పోస్టులు
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 02 పోస్టులు
డెప్యూటీ రిజిస్ట్రార్ / డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02 పోస్టులు
అసిస్టెంట్ రిజిస్ట్రార్ / అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02 పోస్టులు
అకౌంటెంట్: 02 పోస్టులు
మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (జూనియర్): 01 పోస్టు
స్టాటిస్టీషియన్ (Statistician): 01 పోస్టు
అకౌంట్స్ ఆఫీసర్ / ఫైనాన్షియల్ కంట్రోలర్: 01 పోస్టు
అర్హతలు – వయోపరిమితి:
వయస్సు: 01.07.2026 నాటికి టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 35 సంవత్సరాలు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి 45 సంవత్సరాలు మించకూడదు.
వయో సడలింపు: తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు & అనుభవం: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు 500 లేదా 750 పడకల ఆసుపత్రిలో కనీసం 1 నుండి 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1,000/- గా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500/- గా నిర్ణయించారు. ఈ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో “The Director, NIMS, Hyderabad” పేరుతో తీసి సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా నిమ్స్ యాజమాన్యం ఎంపిక ప్రక్రియను చేపడుతుంది:
10 లోపు దరఖాస్తులు వస్తే: అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
11 నుండి 30 లోపు దరఖాస్తులు వస్తే: మెరిట్ ఆధారంగా అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి, ఆపై ఇంటర్వ్యూకు పిలుస్తారు.
30 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే: అభ్యర్థులకు రాత పరీక్ష (Written Test) లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్/CVతో పాటు, అవసరమైన విద్యా అర్హతలు, అనుభవ ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ (స్వయంగా సంతకం) చేయాలి. ఆ తర్వాత వాటన్నింటినీ ఒక కవర్‌లో ఉంచి, కవర్ పైన తాము ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి. భర్తీ చేసిన దరఖాస్తులను 06 జూలై 2026 సాయంత్రం 4.00 గంటల లోపు నిమ్స్ కార్యాలయానికి చేరేలా పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అప్లికేషన్ ఫార్మాట్ కోసం అభ్యర్థులు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ (nims.edu.in) ను సందర్శించవచ్చు.









