
BJP vs Congress : ఖర్గేను అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన అంశం రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసింది. కాంగ్రెస్ నాయకుల నిరసనకు ప్రతిగా బీజేవైఎం నాయకులు గాంధీభవన్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు కొన్ని జిల్లాల్లోనూ చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి ప్లేక్సీలు చింపివేయడంతో నిన్న గొడవలు ప్రారంబమయ్యాయి. కాగా ఈ గొడవలు తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తరించాయి. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ముదిరి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంగళవారం ఉదయం భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేయడంతో పాటు ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు, నేమ్ బోర్డుపై నల్లరంగు పూశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి చేశారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతీకార దాడులకు దిగారు. భువనగిరిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి చేశారు. ఆఫీసులోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు పార్టీల నాయకులు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి మరింత ముదిరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి తీవ్రంగా శ్రమించారు. ఘటనా స్థలాల్లో అదనపు బలగాలను మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రెండు వైపులా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీ చింపివేతతో మొదలైన వివాదం..రెండో రోజు కూడా కొనసాగింది. పరస్పరం ఫ్లెక్సీల చింపివేత, ఇళ్లపై దాడుల ఆరోపణల వరకు వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం శ్రీనగర్ కాలనీలో ఉన్ప రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఫ్లెక్సీని చింపివేసి కోడిగుడ్లు, టమోటాలు విసిరి వేయడంతో గొడవ స్టార్ట్ అయింది.దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. ఇవేకాక నల్లగొండ కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ నాయకుల ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు తొలగించారు. దీంతో ఉద్రిక్తలు మరింత పెరిగాయి.
Also Read : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి.. ఎందుకంటే?
వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడి ?
ఉద్రిక్తలు ఇలా కొనసాగుతుండగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కిటికీలు, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసినట్లు బీజేపీ శ్రేణులు ఆరోపించడం కలకలం రేపింది. ఆ సమయంలో వర్షిత్‌రెడ్డి తల్లి ఇంట్లో ఉందని ఆమెతో దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు, ఆయన మామపై కూడా దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
Also Read : తుక్కుగూడ నర్సు హత్యకేసు… రాడ్‌తో ముఖంపై బాది అత్యాచారం..
బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు
పరస్పర దాడులతో రెండు పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడుల నేపథ్యంలో మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ముట్టడికి బయలు దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో వర్షిత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. . ఒక దశంలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు ఆరోపిసతునననది.
కాగా, అక్కడ నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అక్కడ పరిస్థితి చేయిదాటే పరిస్థితి కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరస్పర దాడుల సమాచారం అందుకున్న నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి అక్కడికి చేరుకుని ఇరువర్గాల శాంతింప జేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి గొడవ నివారణకు చర్యలు చేపట్టారు. ఫ్లెక్సీల చించివేత వివాదంతో మొదలైన ఆ ఉద్రిక్తలు ఇళ్లపై దాడులు చేసుకునేవరవకు వెళ్లాయి, దీంతో నల్లగొండలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు









