BIG BREAKING : టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలో భూ వివాదానికి సంబంధించి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులు తమ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి టిన్‌షీట్లు ఏర్పాటు చేశారని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. అంతేకాకుండా గేటు తాళాలు పగులగొట్టి, అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేశారని పేర్కొంది.

ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించినట్లు కూడా ఓనర్స్ అసోసియేషన్ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు లేఖను అందించింది.

అదే సమయంలో డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు లేఖలు సమర్పించారు. ఈ భూ వివాదంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.