
Telangana : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత బి.ఎం. సందీప్ కుమార్ నియమితులయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన సందీప్ కుమార్ ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల్లో పనిచేశారు. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు.
గతంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్‌లోనూ పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, నాయకుల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కొత్త ఇన్‌ఛార్జ్ దృష్టి సారించనున్నారు.









