India vs China : ఏషియన్ గేమ్స్ మహిళల హాకీ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. చైనాను 1-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ విజయంతో 2026 ఐచి-నగోయా ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో 16వ స్వర్ణం చేరింది. మహిళల హాకీలో ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 1982 తర్వాత ఇదే తొలి స్వర్ణ పతకం. దీంతో దాదాపు 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు మరోసారి ఏషియన్ గేమ్స్ గోల్డ్ అందుకుంది.

Also Read : చహల్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!

మ్యాచ్ ప్రారంభమైన 10వ నిమిషంలో లాల్‌రెమ్సియామి హ్మర్జోటే భారత్‌కు గోల్ అందించింది. భారత్ తరఫున ఆమె ఆడిన 200వ మ్యాచ్‌లోనే ఈ కీలక గోల్ రావడం విశేషం. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్‌లో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. అయితే భారత సీనియర్ గోల్‌కీపర్ సవితా పునియా అద్భుతంగా అడ్డుకుంది. దీంతో చైనాకు గోల్ చేసే అవకాశం దక్కలేదు.

ఆ తర్వాతి రెండు క్వార్టర్లలో చైనా పదేపదే దాడులు చేసినా.. భారత ఆటగాళ్లు గట్టిగా అడ్డుకున్నారు. తమ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్నారు. చివరికి 1-0తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. సలీమా టెటే నాయకత్వంలోని భారత జట్టు ఈ ఏడాది మహిళల హాకీ ప్రపంచకప్‌లోనూ దేశానికి ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ స్థానాన్ని అందించింది. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి మరో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Also Read : ప్రాణాలు పోతున్నా వెనక్కి తగ్గలేదు.. నీర్జా, స్మిత్ మచ్చర్ ఇద్దరూ హీరోలే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.